ఫెరారి యఫ్12 బెర్లినెట్టా స్పెషల్ ఎడిషన్ పరిచయం

By Anil

ఫెరారి తన యఫ్12 ఆధారిత టూర్ డి ఫ్రాన్స్ స్పెషల్ ఎడిషన్ ని పరిచయం చేస్తోంది. ఈ స్పెషల్ సూపర్ కారును సాధారణ ప్రజల కోసం తయారు చేస్తున్నారు అది కూడా కేవలం 799 కార్లను మాత్రమే తయారు చేస్తున్నారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు
ఫెరారి యఫ్12 బెర్లినెట్టా స్పెషల్ ఎడిషన్ కు సంభందించిన మరిన్ని విశేషాలను ఈ క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా..
Also Read: రెనొ క్విడ్ వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్.

ఫెరారి ఇంజన్ :

ఫెరారి ఇంజన్ :

ఫెరారి యఫ్12 టూర్ డి ఫ్రాన్స్ స్పెషల్ ఎడిషన్ కారులో అత్యంత శక్తివంతమైన 6,262 సీసీ గల వి12 ఇంజన్ కలదు. మరియు ఇది 769.3 హార్స్ పవర్, 705 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ని ఇస్తుంది.

ఫెరారి వేగం :

ఫెరారి వేగం :

అరుదైన ఈ ఫెరారి కేవలం 2.9 సెకండ్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని మరియు 7.9 సెకండ్లలో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని యొక్క అత్యధిక వేగం గంటకు 340 కిలోమీటర్లు.

మైలేజ్ :

మైలేజ్ :

ఈ కారులో 15.4 లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఇందులో ఉంది. ఒక సారి పూర్తిగా నింపితే 100 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేస్తంది.

డిజైన్ :

డిజైన్ :

యఫ్13 కారు తో ఈ యఫ్12 బెర్లినెట్టా కారుని డిజైన్ పరంగా పోలిస్తే ఇందులో ఉన్న ప్రామాణికమైన డిజైన్‌లు ఎంతో భిన్నంగా ఉంటాయి. దీనికి ముందు మరియు వెనుకవైపున ఉన్న బంపర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే ఒక విధంగా చెప్పాలంటే దీని డిజైన్ అవతార్ రూపంలో ఉంటుంది.

ఇంటీరియర్ :

ఇంటీరియర్ :

ఇందులో ఉన్న సీట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. మరియు దీనిలో ఉన్న డ్రైవర్ లొకేషన్, డ్రైవింగ్ మోడ్ చాలా అడ్వాన్స్‌డ్ గా వచ్చాయి.

 బరువు :

బరువు :

ఈ ఫెరారి యఫ్12 టూర్ డి ఫ్రాన్స్ ఎడిషన్ సూపర్ కారు బాడి మొత్తాన్ని కార్బన్ ఫైబర్ ప్యానెల్స్‌తో తయారు చేశారు. అందువలన దీని బరువు దాదాపుగా 110 కిలోలు తగ్గిపోయింది. అయితే యఫ్13 బెర్లినెట్టా కారు దీనికన్నా బరువుగా ఉంటుంది.

పరీక్షలు :

పరీక్షలు :

ఫెరారి యఫ్12 బెర్లినెట్టా టూర్ డి ఫ్రాన్స్ స్పెషల్ ఎడిషన్ కారును ఏరోడైనమికల్‌గా(వాయుగతపరంగా) పరీక్షించబడింది.

స్పాయిలర్ :

స్పాయిలర్ :

ప్రతి ఒక్క స్పోర్ట్స్ కారుకు ఖచ్చింతంగా ఉంటుంది ఇది. స్పాయిలర్ అనగా కారు వెనుకవైపు బ్యానెట్ మీద ఒక ఉబ్బెత్తు ఆకారం ఉంటుంది పక్క ఫోటోలో దీనిని మీరు గమనించవచ్చు. ఈ స్పాయిలర్ యొక్క ఎత్తు 30ఎమ్ఎమ్ మరియు వెడల్పు 60 ఎమ్ఎమ్ గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 14, 2015, 15:27 [IST]
English summary
Ferrari F12 Berlinetta Tour de France Special Edition Introduced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+