20 నెలల్లో.. 1.5 లక్షల ఎలైట్ ఐ20 కార్లను అమ్మిన హ్యూందాయ్
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ కు చెందిన ఎలైట్ ఐ20 మోటర్ కారు కేవలం 20 నెలల కాలంలోనే 1.5 లక్షలు అమ్ముడుపాయాయి. రికార్డ్‌లను బద్దలు కొట్టడానికి పెద్దగా సమయం అవసరం లేదని నిరూపించింది ఈ ఎవలైట్ ఐ20 కారు. అతి తక్కువ కాలంలో విశేష అభిమానం పొందిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మరింత తెలుసుకోండి: మీ నగరంలో మీకు నచ్చిన హ్యుందాయ్ కార్ల ధరలను తెలుసుకోండి.
దీనిని 2014 మార్చిలో మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో గల ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాపారంలో దాదాపుగా 66 శాతం వాటాను ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 దగ్గించుకుంది. మరి ఇంత ఆదరణ పొందింది అంటే దీనిలో ఉన్న విశేషాలు ఎంటో ఒక సారి చూద్దాం రండి....

ఇంజన్
ఈ హ్యుందయ్ ఎలైట్ ఐ20 కారులో 1197సీసీ గల 4-సిలిండర్ల, 1.2-లీటర్ కప్పా డ్యూయల్ విటివిటి ఇంజన్ కలదు.

ట్రాన్స్‌మిషన్
పెట్రోల్ ఇంధనంతో నడిచే కార్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను మరియు డీజల్ ఇంధనంతో నడిచే కార్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

పర్ఫామెన్స్
ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారు 6000 ఆర్‌పియమ్ వద్ద 83బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పియమ్ వద్ద 115యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ మొత్తం ఫ్రంట్-వీల్స్‌కు అందిస్తుంది. అనగా ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అన్నమాట.

కొలతలు
ఎలైట్ కారు క్రింది కొలతలలో ఉంది.
- పొడవు: 3985యమ్‌యమ్
- వెడల్పు: 1734 యమ్‌యమ్
- ఎత్తు: 1505 యమ్‌యమ్
- వీల్ బేస్: 2570 యమ్‌యమ్
- గ్రౌండ్ క్లియరెన్స్: 170 యమ్‌యమ్ కలదు.
- స్లీక్ సిల్వర్
- మిడాస్ గోల్డ్
- ప్రిస్టైన్ బ్లూ
- స్టార్‌డస్ట్
- రెడ్ ప్యాసన్
- మైస్టిక్ బ్లూ
- పోలార్ బ్లూ
- పెట్రోల్ వర్షన్లో గల ప్రారంభ వేరియంట్ ధర సుమారుగా రూ. 6,17,340
- డీజల్ వర్షన్లో గల ప్రారంభ వేరియంట్ ధర సుమారుగా రూ. 7,61,269
- నిస్సాన్ మైక్రా
- మారుతి సుజుకి రిట్జ్
- టయోటా ఎటియోస్ లివా

మైలేజ్
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారు యొక్క అత్యధిక ఇంధన ట్యాంక్ సామర్థ్యం దాదాపుగా 45 లీటర్లుగా ఉంది.పెట్రోల్ కారు మీకు ఇస్తుంది 18.60 కిలోమీటర్ల మైలేజ్‌ను మరియు డీజల్ వేరియంట్ మీకు ఇస్తుంది లీటర్‌కు 22.54 కిలో మీటర్ల మైలేజ్‌ఇస్తుంది.

సీటింగ్ కెపాసిటి
ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారులో ఐదు మంది ఎంతో సుఖవంతంగా ప్రయాణించవచ్చు. అంటే ఒక కుటుంబం దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బ్రేక్స్
ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేకులను మరియు వెనుకవైపున డ్రమ్ బ్రేకులను అందించారు.

సస్పెన్షన్
ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 లో ముందువైపున కాయిల్ స్ప్రింగ్ గల మెక్ పర్సన్ స్ట్రట్ గల సస్పెన్షన్ మరియు వెనుకవైపున కాయిల్ స్ప్రింగ్ గల టార్షన్ బీమ్ ఆక్సిల్‌ను అందించారు.

లభించు రంగులు
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏడు విభిన్న రంగుల్లో లభించును.

ధర
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 యొక్క ప్రారంభ వేరియంట్లలో ప్రారంభ ఆన్-రోడ్ ధరలు..
ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్) గా ఉన్నాయి.

పోటి
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారు మార్కెట్లో ఉన్న క్రింద మోడల్‌లతో పోటీ పడుతోంది.



Click it and Unblock the Notifications








