లాస్ ఎంజల్స్ మోటార్ షోలో సందడి చేస్తున్న హోండా సివిక్ కూపే
హోండా మోటార్స్ తన సివిక్ కూపె కారును బుదవారం నాడు లాస్ ఎంజిల్స్‌లో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించారు. అయితే ఇంతకు ముందు న్యూయార్క్ ఆటో షోలో ప్రదర్శించిన సివిక్ కూపే కారు కన్నా ఇది ఎంతో బాగుందని అక్కడ పాల్గొన్న కొంత మంది తెలిపారు.
Also Read: కొత్తతరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.
ఈ హోండా సివిక్ కూపె చూడటానికి హ్యాచ్ బ్యాక్ మరియు సెడాన్ సిబ్లింగ్ మోడల్స్ కన్నా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అంతేనా దీని గురించి తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏదీ ఓ సారి ఇక్కడ గల స్లైడర్‌ల మీద లుక్కేసుకోండి.

ఇంజన్
సివిక్ కూపె రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అయితే ఇందులో గల ప్రారంభ వేరియంట్‌లో 2-లీటర్, నాలుగు సిలిండర్లు గల ఐ-విటిఇసి ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు.

పవర్
హోండా కొత్త సివిక్ కూపె లో గల ఇంజన్ మీకు అందిస్తుంది 158బిహెచ్‌పి పవర్ మరియు 174 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మల్టీ మీడియా
సరి కొత్త సివిక్ కూపె కారులో సుతి మెత్తని ప్లాస్టిక్‌ను వినియోగించారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆధారిత తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వాతావరణాన్ని కంట్రోల్ చేయగల సిస్టమ్ ఉంది.

ల్యాంప్స్
సివిక్ ముందు భాగంలో గల హెడ్ ల్యాంప్‌లు డే టైమ్ రన్నింగా ల్యాంప్ ఫీచర్‌తో వచ్చాయి. ఇక వెనుక వెపుగల టెయిల్ ల్యాంప్స్ కారు వెనుక మద్య భాగం వరకు డిజైన్ చేయబడ్డాయి.

డిజైన్
ఇందులో ముందు భాగానికి క్రోమ్ అద్దకంతో గల కొత్త గ్రిల్ అమర్చబడినది. ఇది చూడటానికి ఎంతో బోల్డ్‌గా ఉంటుంది.



Click it and Unblock the Notifications








