డిసి అవంతి లిమిటెడ్ ఎడిషన్ 310 ఆవిష్కరణ: త్వరలో విడుదల
మన దేశంలో స్పోర్ట్స్ కార్లు తయారు కావడం మనకు ఎంతో గర్వకారణం. మన వారు తయారు తయారు చేస్తున్న స్పోర్ట్స్ కార్లు మన రోడ్ల మీదనే కాదు విదేశాలలో కూడా పరుగులు పెడుతున్నాయి. డిసి డిజైన్స్ వారు దేశీయంగా డిసి అవంతి కార్లను తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే డిసి అవంతి లిమిటెడ్ ఎడిషన్ 310 మోడల్ కారును 2016 ఎప్రిల్ నెలలో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ డిసి అవంతి లిమిటెడ్ ఎడిషన్ 310 కారు ప్రత్యేకమైనది అని తెలిపారు. ఎందకో తెలుసా? కేవలం 31 లిమిటెడ్ ఎడిషన్ 310 కార్లను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డిసి అవంతి ఇంజన్
డిసి అవంతి లిమిటెడ్ ఎడిషన్ 310 లో రెనొ వారి 2.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌ను వినియోగించారు. సాధారణంగా ఈ ఇంజన్ 250 బిహెచ్‌పి పవర్ను ఉత్పత్తి చేయును. కాని డిసి లో దీనిని అమర్చిన తరువాత 310 బిహెచ్‌పి పవర్ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. అయితే దీని వెనకున్న రహస్యాన్ని వెల్లడించలేదు.

ట్రాన్స్‌మిషన్
ఇందులో గల ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను అమర్చారు. దీనిలో ఉపయోగించిన పెడల్ షిఫ్టర్స్‌ను దేశీయంగా తయారు చేశారు.

అదనపు శక్తి
ఇందులో ఉపయోగించిన ఉత్తమ సస్పెన్షన్ మరియు గాలి ద్వారా కలిగే ఘర్షణను నిరోధించడానికి దీనిని ఏరోడైనమికల్‌గా తయారు చేశారు. అందువలన ఇది మరింత శక్తిని అందివ్వడానికి ఈ రెండు అంశాలు కారణమయ్యాయి.

ఫీచర్లు
ఇందులో ఇంజన్ తప్ప మిగతా అన్ని అంశాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందు వైపుగల స్ల్పిట్టర్ మీద కార్బన్ ఫైబర్, రియర్ ఢిఫ్యూసర్, స్పాయిలర్ మరియు యల్‌ఇడి హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, వంటివి ఇందులో ఉన్నాయి.

ఇంటీరియర్
ఇందులో ఎక్కువగా స్టీరింగ్ వీల్ మరియు ఇంటీరియర్ పై భాగాలన్ని కూడా అల్కంతారా అనే లెథర్‌తో ఫినిషింగ్ చేశారు. మరియు ఇందులో టియఫ్‌టి ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే కలదు.

భద్రత
ఇందులో గల యాంటి-రోల్ బార్లు కారును నిలకడగా ఉంచడానికి సహాయపడటతాయి. మరియు ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ఎయిర్ బ్యాగ్‌లను అందించారు.

ధర
డిసి అవంతి కారు యొక్క స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ, 35 లక్షల వరకు ఉండవచ్చు. ఇక ఈ డిసి అవంతి లిమిటెడ్ ఎడిషన్ 310 మోడల్ కారుని విడుదల చేసినపుడు ధర దాదాపుగా రూ. 44 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) గా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications








