బాలెనొ కారును విడుదల చేసిన మారుతి సుజుకి.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాలెనొ కారును మారుతి సుజుకి అత్యంత ఆకర్షణీయమైన ధరకు భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) నిర్ణయించారు. మరొక విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్‌లలో ప్రస్తుతం వరకు కేవలం యస్-క్రాస్ మోడళ్ల విక్రయాలు మాత్రమే జరిగేవి. అయితే తాజాగా విడుదలైన మారుతి సుజుకి బాలెనొ కారును కూడా నెక్సా షోరూమ్ నుండి అందుబాటులోకి తేనున్నారు. అంటే నెక్సా షోరూమ్ నుండి ప్రస్తుతం రెండు రకాల కార్లు అందుబాటులో ఉంటాయి. మరియు మారుతి సుజుకి ద్వారా భారత్‌లో తయారయ్యి జపాన్‌కు ఎగుమతి చేస్తున్న మొదటి మోడల్ కూడా ఇదే కావడం గమనార్హం.
Also Read: మీ నగరంలో మారుతి సుజుకి కార్ల ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మారుతి బాలెనొ కారుకు సంభందించిన మరిన్ని విషయాలు క్రింది కథనాలు ద్వారా తెలుసుకుందాం...

బాలెనొ పెట్రోల్ వేరియంట్స్ ధరలు :
- సిగ్మా ధర రూ. 4.99 లక్షలు
- డెల్టా ధర రూ. 5.71 లక్షలు
- జీటా ధర రూ. 6.31 లక్షలు
- ఆల్ఫా ధర రూ. 7.01 లక్షలు
- సివిటి ధర రూ. 6.76 లక్షలు
- సిగ్మా ధర రూ. 6.16 లక్షలు
- డెల్టా ధర రూ. 6.81 లక్షలు
- జీటా ధర రూ. 7.41 లక్షలు
- ఆల్ఫా ధర రూ. 8.11 లక్షలు
- బాలెనొ డీజల్ వేరియంట్ యొక్క ఇంజన్ 1248సీసీ, 4-సిలిండర్స్ కలవు, ఇది 74బిహెచ్‌పి మరియు 192ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- బాలెనొ పెట్రోల్ వేరియంట్ యొక్క ఇంజన్ 1197సీసీ, నాలుగు సిలిండర్లు కలవు ఇది 83బిహెచ్‌పి మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- యల్ఇడి లైట్లు గల డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్
- అల్లాయ్ వీల్స్
- నావిగేషన్ సిస్టమ్
- వాయిస్ కమాండ్
- ఆపిల్ కార్‌ప్లే
- దీని యొక్క టాప్ ఎండ్ వేరియంట్లో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
- మారుతి సుజుకి సియాజ్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల ధర రూ.9.20 లక్షలు.
- రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్‌ల మధ్య పెరిగిన పోటి.

బాలెనొ డీజల్ వేరియంట్స్ ధరలు :
గమనిక అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ).

ఇంజన్ స్పెసిఫికేన్స్ :

ట్రాన్స్‌మిషన్ :
ఈ రెండు ఇంజన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు. అయితే బాలెనొ డెల్టా పెట్రోల్ వేరియంట్ కారులో కంటిన్యుయస్లి వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ (సివిటి) అవకాశం కలదు.

మైలేజ్ :
మారుతి సుజుకి విడుదల సమాచారం ప్రకారం బాలెనొ పెట్రోల్ వేరియంట్ లీటర్ కు 21.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరియు బాలెనొ డీజల్ వేరియంట్ లీటర్ కు 27.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్స్ :

పోటి :
మారుతి సుజుకి బాలెనొ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్, వోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు గట్టి పోటిని ఇస్తోంది.

భద్రత :
మారుతి సుజుకి భద్రత విషయంలో ఒక పెద్ద అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మారుతి సుజుకి బాలెనొకు చెందిన అన్ని వేరియంట్లలో యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబియస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లను అన్ని బాలెనొ మోడళ్లలో అందించింది.



Click it and Unblock the Notifications








