ఎగుమతికి కోసం మారుతి సుజుకి ఇగ్నిస్ కారు
భారత దేశపు అతి పెద్ద ఆటోమొబైల్ దిగ్గజ కంపెని మారుతి సుజుకి తన ఇగ్నిస్ క్రాస్ఓవర్ కారును 2015 టోక్యోలో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించింది. మరియు ఢిల్లీలో జరగనున్న 2016 ఆటో ఎక్స్-పోలో కూడా ఈ కారును ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. అంతకు ముందు మారుతి సుజుకి తన ఇగ్నిస్ కారును ఐయమ్-4 కాన్సెప్ట్ కారుగా 2015లో జరిగిన జెనీవా మోటార్ షోలో దీనిని ప్రదర్శించింది.
మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ కారును కేవలం భారతీయ మార్కెట్‌కు మాత్రమే అందించాలని అనుకోలేదు. దీనిని అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని ఆలోచిస్తోంది. అందులో ముఖ్యంగా ఈ కారును జర్మనీకి ఎగుమతి చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాస్ఓవర్ గురించి మరింత సమాచారం క్రింది స్లైడర్‌లో ద్వారా తెలుసుకోగలరు.

మారుతి సుజుకి క్రాస్ఓవర్ కారు అత్యంత శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది మరియు ఇది మ్యాన్యువల్ మరియు సివిటి గేర్ బాక్స్ ఆఫ్షన్‌లలో లభించనుంది.

మారుతి సుజుకి తమ వినియోగదారులకి 4-వీల్ డ్రైవ్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను ఈ ఇగ్నిస్ ద్వారా అందిస్తోంది.

నాలుగు మీటర్ల పొడవున్న ఈ ఇగ్నిస్ కారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా వాహనాలను అందివ్వడానికి భారతదేశము ఎంతో అనువైనదని. మరియు ఎగుమతి కూడా ఎంతో సులభమని మారుతు సుజుకి వెల్లడించింది. అందులో భాగంగానే ఈ మద్యనే విడుదలైన బాలెనొ మరియు ఇగ్నిస్ కార్లను జర్మనీకి ఎగుమతి చేయాలని నిర్ణయించింది.



Click it and Unblock the Notifications








