భారతీయ మార్కెట్లోకి ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర రూ. 72 లక్షలు
ప్రముఖ దిగ్గజ లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా భారత దేశపు లగ్జరీ కార్ల మార్కెట్లోకి తన క్యూ7 ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల అయిన ఈ కారును కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌తో రూపొందించారు. త్వరలో దీనిని దేశీయంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. 2016 సంవత్సరం మధ్య భాగం నుండి వీటి తయారిని దేశీయంగా ప్రారంభిస్తామని తెలిపారు.
Also Read: మారుతి సుజుకి యస్-క్రాస్ ప్రీమియా ఎడిషన్ కారు విడుదల: ధర కోసం...
ఈ 2017 ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ కారుగా పిలవబడే ఇది మునుపటి తరం క్యూ7 కారు కన్నా దాదాపుగా 300 కిలోలు తక్కువ బరువు ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మరి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం క్రింది స్లైడర్‌లలో కలదు.

ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ధర
- ఆడి క్యూ7 ప్రీమియమ్ ప్లస్ ధర రూ. 72 లక్షలు
- ఆడి క్యూ7 టెక్నాలజీ వేరియంట్ ధర రూ. 77.5 లక్షలు
- యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్
- అటెన్షన్ అసిస్ట్
- కొలిసన్ అవాయిడెన్స్ అసిస్ట్
- నైట్ విజన్ అసిస్ట్ వంటి ఫీచర్లు.
రెండు ధరలు ఎక్స్-షోరూమ్,(ఢిల్లీ) గా ఉన్నాయి.

ఆడి క్యూ7 ఇంజన్
ఈ ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ యుస్‌యువి కారులో 3.0-లీటర్ గల టర్బోఛార్జ్‌డ్ వి6 డీజల్ ఇంజన్ కలదు

పవర్ మరియు గేర్ బాక్స్
ఇందులో గల ఇంజన్ దాదాపుగా 249 బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 8-స్పీడ్ టిప్‌ట్రోనిక్ గేర్ బాక్స్ కలదు. ఇంజన్ నుండి విడుదలయ్యే పవర్‌ను అన్ని చక్రాలకు అందించడానికి ఇందులో ఆడి క్వాట్రో టెక్నాలజీ కలదు.

అత్యధిక వేగం
గంటకు 100 కిలోమీటర్ల కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.1 సెకండ్ల కాలంలోనే చేరుకోవడానికి ఇందులో గల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ సహాయపడుతుంది. మునుపటి మోడల్ కారు కన్నా ఇది ఇంకా వేగవంతమైనది.

మల్టీమీడియా
ఇందులో బోస్ ఆడియో సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్, హెడ్స్-అప్ డిస్ల్పే మరియు న్యావిగేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఫీచర్లు
ఈ ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ కారులో యల్‌ఇడి మ్యాట్రిక్స్ హెడ్ లైట్స్, ఎలక్ట్రానిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న లెథర్ సీట్లు, ప్యానరోమిక్ సన్ రూఫ్, నాలుగు జోన్ల క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత
ఇంత ధర పోసి కొనే కారులో భద్రత ఫీచర్లు లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇందులో కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

పోటి
ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జియల్-క్లాస్ మరియు వోల్వో ఎక్స్‌సి90 వంటి కార్లకు గట్టి పోటిని ఇవ్వనుంది.



Click it and Unblock the Notifications








