2016 జనవరిన విడుదల కానున్న సరికొత్త ఫోర్డ్ ఎండీవర్
ఫోర్డ్ మోటార్స్ వారు భారతీయ మార్కెట్‌లోకి తమ సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సరికొత్త ఎండీవర్ బయట అధేయమైన కఠినత్వాన్ని మరియు లోపలి వైపున సౌలభ్యమైన సౌకర్యాలతో మన ముందుకు రానుంది. దీనిని 2016 జనవరిలో విడుదల చేయనున్నారు.
మరి అతి త్వరలో విడుదల కానున్న సరి కొత్త ఫోర్డ్ ఎండీవర్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

ఇంజన్
ఈ సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ రెండు ప్రత్యేతమైన ఇంజన్ ఆఫ్షన్‌లలో లభించును. అవి 2.2-లీటర్ మరియు 3.52-లీటర్ టిడిసిఐ టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లు.

పవర్
2.2-లీటర్ డీజల్ ఇంజన్ మీకు ఇస్తుంది 158బిహెచ్‌పి పవర్ మరియు 385 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

3.3-లీటర్ ఇంజన్
ఇందులో గల మరొక ఇంజన్ ఆప్షన్ 3.3-లీటర్ డీజల్ యంత్రం మీకు దాదాపుగా 197 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్
ఈ సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ కారులో 225 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. మరియు 800 ఎమ్ఎమ్ వరుకు గల నీటి లోతులో ఇది మునగ గలదు ఈ శ్రేణిలో ఇదే అతి ఉత్తమ వాహనం.

ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్
ఇందులో ఉన్న ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మీరు నేల మీద ఉండగానే దీనిని డ్రైవ్ చేస్తున్నప్పుడు గాలిలో ఎగురుతున్న అనుభూతిని పొందుతారు.

ఎలక్ట్రిక్ లాక్ ఢిఫరెన్షియల్
ఒక వైపు చక్రం నేల మీద మరియు మరొకవైపుగ చక్రం నీటలో లేదా బురదలో లేదా ఇసుకలో ఉన్నపుడు రెండిటిలో ఒక చక్రమే తిరుగుతుంది, నేల మీద ఉన్న చక్రం తిరగదు. ఇలాంటి సంధర్బంలో ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ లాక్ డిఫరెన్షియల్ సిస్టమ్ మొత్తం పవర్‌ను తిరగకుండా ఆగిపోయిన చక్రానికి అందిస్తుంది. తద్వారా వాహనం బయటకు వస్తుంది. ఇలాంటి ఫీచర్ ఇందులో కలదు.

హిల్ అసిస్ట్ కంట్రోల్
ఇందులో గల హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు లాంచ్ అసిస్ట్ కంట్రోల్ రెండు కూడా వాహనం ఎక్కువ వాలు గల తలం నుండి క్రిందకు ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఉపయోగపడతాయి.

2.2-లీ 4X2 మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
ఇందులో గల 2.2-లీటర్ అత్యంత శక్తివంతమైన ఇంజన్ 160 పియస్ (118 కిలో వాట్) అవుట్‌పుట్ ఇవ్వగలదు. మరియు భద్రత విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు కలవు, ఇంటీరియర్ డిజైన్‌లో లెథర్, లెథర్‌తో గల గేర్ నాబ్ మరియు లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ ఇందులో కలదు.

2.2-లీ 4X4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్
ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ తో పాటు 2.2-లీటర్ ఇంజన్ ఇది 160 పియస్(118 కిలో వాట్) అవుట్ పుట్ ఇస్తుంది. మరియు ఇందులో డ్రైవర్ మరియు ముందు వైపు కూర్చునే ప్యాసింజర్ కు ఎయిర్ బ్యాగును అందించారు. ఇక ఇంటీరియర్ లో లెథర్ ను వాడారు. అంతే కాకుండా ఇందులో టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలదు.

3.2-లీ 4X4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్
ఇందులో గల అత్యంత శక్తివంతమైన 3.2-లీటర్ ఇంజన్ దాదాపుగా 200 పియస్(147 కిలో వాట్) పవర్ ఉత్పత్తి చేస్తుంది. ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగ్‌లను అందించారు. వీటితో పాటు ఇందులో టెర్రైన్ మేనేజ్‌మెంజ్ సిస్టమ్ కలదు.

2.2-లీ 4X2 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టైటానియమ్
టైటానియమ్ వర్షెన్‌లో అత్యంత శక్తివంతమైన 2.2-లీటర్ డీజల్ ఇంజన్ కలదు ఇది మీకు 160పియస్( 118 కిలోవాట్) పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. భద్రత విషయంలో ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులను కల్పించారు. దీనిలో కూడా లెథర్‌తో ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు.

3.2-లీ 4X4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టైటానియమ్
ఇందులో అత్యంత శక్టివంతమైన 3.2-లీటర్ డీజల్ ఇంజన్ కలదు ఇది మీకు దాదాపుగా 200పియస్ (147కిలోవాట్) పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. భద్రత కోసం ఇందులో డ్రైవర్, ప్యాసింజర్, సైడ్,కర్టెన్ మరియు మోకాలి దగ్గర ఇలా మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులను కల్పించారు. టర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు ,సెమి ఆటోమేటిక్ ప్యార్లర్ పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు.

ధర
సరికొత్త 2016 ఫోర్డ్ ఎండీవర్ ధర దాదాపుగా 20 నుండి 25 లక్షల రుపాయలు ఎక్స్-షోరూమ్ గా ఉండనున్నాయి.

- ఫోర్డ్ ఎండీవర్ కు చెందిన మరిన్ని వివరాల కోసం....
- అత్యంత ప్రసిద్దిగాంచిన వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు గురించి పది ఆశక్తికరమైన విషయాలు
- 2016 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్న శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్


Click it and Unblock the Notifications








