విడుదలకు సిద్దమైన సరి క్రొత్త టయోటా ప్రియస్: ఇంజన్, ధర, ఇతర స్పెసిఫికేషన్స్.
జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారులైన టయోటా తమ కొత్త తరం టయోటా ప్రియస్ కారును విడుదలకు సిద్దం చేశారు. ప్రియస్ కారును 2016 సంవత్సరం చివరకు విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే భారత దేశంలో ఇదివరకే ఉన్న ప్రియస్ హైబ్రిడ్ సెడాన్ కారు స్థానంలో ఈ ఉత్కంఠభరితమైన నాలుగవ తరం ప్రియస్ కారును తీసుకురానున్నారు.
Also Read: కొత్త తరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.
దీని విడుదలకు ముందే మనకు దీనిని 2016లో ఢిల్లీ జరిగే ఆటో-ఎక్స్‌పో ద్వారా చూసే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్-పోలో ఇది మనకు కనువిందు చేయనుంది.
Also Read: మీ నగరంలో టయోటాకు చెందిన మీకు నచ్చిన కార్ల ధరలను తెలుసుకోండి.
టయోటా ప్రియస్ కారుకు చెందిన మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

ప్రియస్ ఇంజన్ :
2016 టయోటా ప్రియస్ కారులో నాలుగు సిలిండర్లు గల 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ప్రియస్ పవర్ :
2016 టయోటా ప్రియస్‌లో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ 97బిహెచ్‌పి మరియు 142ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హైబ్రిడ్ వెర్షన్ :
ఈ కారులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ అదనంగా 71బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం శక్తిని ఇందులో ఉన్న నికెల్-మెటల్ హైబ్రిడ్ బ్యాటరీ స్టోర్ చేసుకుంటుంది.

థర్మల్ ఎఫీషియన్సీ :
టయోటాలో ముందున్న ప్రియస్ కారు కన్నా ఈ కొత్త ప్రియస్‌లో దాదాపుగా 40 శాతం థర్మల్ ఎఫీషియన్సీని అభివృద్దిపరిచారు.

ప్రియస్ ఉద్గారాలు :
2016 టయోటా ప్రియస్ ఉత్తమ మైలేజ్‌ని ఇస్తుంది. దీని ముందు మోడల్ కన్నా ఇందులో అతి తక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదల అవుతాయి.

బూట్ స్పేస్ :
టయోటా క్రితం మోడల్‌తో పోలిస్తే ఇందులో అత్యధకంగా బూట్ స్పేస్‌ను అందించింది. ఎక్కువగా ఇందులో 502-లీటర్లు బూట్ స్పేస్ ఉన్నట్లు తెలిసింది.

ఉత్తమ ఛాసిస్ డిజైన్ :
2016 టయోటా ప్రియస్ కారు టయాటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్ఛర్ (టి.యన్.జి.ఎ) పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. దీని ఫ్రేమ్‌ని మునుపటి ప్రియస్‌తో పోల్చితే 60 శాతం అత్యంత ధృడంగా తయారు చేసినట్లు తెలిపారు.

సిబియు టెక్నాలజీ :
ఈ నాలుగవ తరానికి చెందిన కొత్త టయోటా ప్రియస్ పూర్తిగా కంప్లీట్లి బిల్ట్ యూనిట్ (సి.బి.యు) ఆధారంగా భారతీయ మార్కెట్లోకి విడుదల కాబోతోంది.

ప్రియస్ ధర
ఇప్పడిప్పుడే అభివృద్ది చెందుతున్న టయోటా ప్రియస్ మోడల్స్‌లో వచ్చిన నాలుగవ జనరేషన్ 2016 మోడల్ ప్రియస్ కారు ధర ఇంచుమించు 35 నుండి 40 లక్షలు మధ్య ఉండనుంది. (ఎక్స్-షోరూమ్, ఇండియా).

టయోటా హైబ్రిడ్ మోడల్స్
ప్రస్తుతం టయోటా మోటార్స్ భారతీయ మార్కెట్లో కేవలం రెండు హైబ్రిడ్ మోడల్స్‌ను మాత్రమే అందిస్తోంది. అవి ప్రియస్ మరియు క్యామ్రి హైబ్రిడ్.



Click it and Unblock the Notifications








