రేంజ్ రోవర్ నుండి ఎవోక్ కన్వర్టిబుల్: 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు

By Anil

2016లో ఢిల్లీలో జరగబోయే ఇండియన్ ఆటో ఎక్స్ పో ఈ నూతన సంవత్సరానికి దేశం మొత్తం వెలుగులు పంచనుంది. 2016 సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో ఆటో ఎక్స్ పో కార్యక్రమం జరగనుంది. ఈ సందర్బంగా ఎన్నో వాహన సంస్థలు తమ నూతన వాహనాలను ఇందులో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
Also Read: మీ జన్మ నక్షత్రానికి తగిన కారు ఏదో తెలుసా ?

ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ రేంజ్ రోవర్ ఈ సందర్బంగా సరికొత్త కన్వర్టిబుల్ ఎవోక్ కారును ప్రదర్శించనుంది. ఇది చూడటానికే ఎంతో బాగుంది. మార్కెట్లోకి వస్తే దీనిని దక్కించుకోకుండా ఎవరు ఉండగలరు చెప్పండి.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ కారు గురించి మరింత సమాచారం క్రింది కథనంలో

లాస్ ఎంజిల్స్ ఆటో షోలో

లాస్ ఎంజిల్స్ ఆటో షోలో

ఈ మధ్యనే లాస్ ఎంజిల్స్ లో జరిగిన ఆటో ఎక్స్ పో లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వారు ఉత్పత్తికి సిద్దమైన కన్వర్టిబుల్ యస్‌యువి కారును ప్రదర్శించారు.

170 దేశాలలో

170 దేశాలలో

ల్యాండ్ రోవర్ వారు తమ కన్వర్టిబుల్ యస్‌యువి కార్లను దాదాపుగా 170 దేశాలలో అమ్మకాలు జరుపుతున్నారు.

ఇంజన్

ఇంజన్

ఈ సరికొత్త ల్యాండ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ అందుబాటులో కలదు.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులో గల ఇంజన్‌ను 9-స్పీడ్ జడ్‌ఎయఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను అనుసంధానం చేశారు. మరియు ఇందులో గల ఇంజన్ పూర్తిగా అల్యూమినియం రూపొందించారు.

పని తీరు

పని తీరు

ఎవోక్ కన్వర్టిబుల్ లో గల రెండు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ల పని తీరు దాదాపుగా ఇంతకు ముందు గల ఎవోక్ మోడల్ ను పోలి ఉంటుంది.

 టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్

టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్

తెగువ గల వినియోగదారుల కోసం ఈ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ కారులో టర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ ను కల్పించారు. ఈ కన్వర్టిబుల్ కారు ఆఫ్-రోడ్ మీద కూడా చక్కటి పనితీరును కనబరుస్తుంది.

టాప్ రూఫ్

టాప్ రూఫ్

ఇందులో గల టాప్‌ను మనకు కావాల్సినపుడు ఒపెన్ మరియు క్లోజ్ చేసుకునే అవకాశం కలదు. ఈ టాప్ ను కేవలం 18 సెకండ్ల కాలంలోనే మూసి వేయవచ్చు. ఈ రూఫ్ ను గంటకు 48 కిలో మీటర్ల వేగంలో కారు ఉన్నపుడు కూడా ఆపరేట్ చేయవచ్చు.

సిబియు

సిబియు

భారతీయులకు 2016 లో పరిచయం కానున్న ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ కారును కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌‌తో రూపొందిస్తున్నారు.

రేంజ్ రోవర్ నుండి ఎవోక్ కన్వర్టిబుల్ కారు.
  1. లాంఛనంగా విడుదలైన రేంజ్ రోవర్ ఎవోక్: ఇంజన్, ధర....
  2. ధర ఎక్కువా? అయితే మాకేంటి
  3. 2016 లో విడుదలకు సిద్దమైన మెర్సిడెస్ బెంజ్ జియల్ఇ 450 ఎయమ్‌జి కూపే

More from DriveSpark

Article Published On: Tuesday, December 29, 2015, 10:59 [IST]
English summary
Range Rover Evoque Convertible Coming To 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+