భారత్‌లో స్కోడా కార్ల మీద పెరిగిన ధరలు
స్కోడా ఆటో భారత్‌లో ఉన్న తమ మోడల్స్ మీద ధరలను పెంచినట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి దాదాపుగా 2 నుండి 3 శాతం వరకు ధర పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2016 జనవరి 1 తేది నుండి అమలులోకి రానున్నట్లు తెలిపారు.
స్కోడా వారి ప్రస్తుతం నాలుగు మోడల్స్‌ను భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. స్కోడా గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం...

స్కోడా మోడల్స్ మీద దాదాపుగా 14,000 నుండి 50,000 వరకు ధరలను పెంచినట్లు తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో స్కోడా నాలుగు మోడల్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. అవి, ర్యాపిడ్, ఆక్టావియా, సూపర్బ్ మరియు ఎటి.

2016లో ఢిల్లీ జరగబోయే ఆటో ఎక్స్‌పోలో మరిన్ని కొత్త మోడల్స్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

ధరలు పెంచడానికి కారణం, ముడి సరుకు ధరల పెంపు మరియు విదేశీ ధనం మారకపు రేటులో వ్యత్యాసాల వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

స్కోడా మాత్రమే కాదు ఈ నెలలో హ్యుందాయ్ మోటార్స్, మారుతి సుజుకి, నిస్సాన్ మరియు డాట్సన్ వారు కూడా ధరలను పెంచారు.

ఇవి మాత్రమే కాదు లగ్జరీ కార్ల సంస్థలు అయిన ఆడి, బిఎమ్‌డబ్ల్యూ కూడా దేశీయంగా అందుబాటులో ఉన్న తమ మోడల్స్ మీద ధరలను పెంచారు.

- భారతీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు: ఇందులో మీ కారు ఉందా?
- భారతీయ మార్కెట్లోకి రెనిగేడ్ జీప్ కాంపాక్ట్ యస్‌యువి
- టూ వీలర్ల ధరలు పెరుగుతున్నాయ్...!!


Click it and Unblock the Notifications