వోక్స్‌వ్యాగన్ 21 వ శతాబ్ధపు బీటిల్ కారు మార్కెట్లోకి విడుదల: ధరూ. 28.73 లక్షలు
వోక్స్‌వ్యాగన్ మోటార్స్ వారి ఏకైక బ్రాండ్ కారుగా చెప్పుకునే బీటిల్ కారు మార్కెట్లోకి విడుదల అయ్యింది. మార్కెట్లో ఎన్ని కార్లు ఉన్నా ఇలాంటి కార్లు మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. మంచి డిజైన్ మరియు కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి.
మీరు ఈ కారును తెలుగులో ఉన్న రామయ్యా వస్తావయ్యా సినిమాలో చూసుంటారు కదా. మరి దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

ఇంజన్
21 వ శతాబ్దపు బీటిల్ కారులో 1.4-లీటర్ టర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్
ఇందులో గల ఇంజన్ దాదాపుగా 148 బిహెచ్‌పి పవర్‌ని విడుదల చేస్తుంది. ఈ మొత్తం పవర్‌ను ముందు చక్రాలకు 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్ చేరవేస్తుంది.

ఫీచర్లు
ఈ సరికొత్త బీటిల్ కారులో వచ్చిన నూతన ఫీచర్లు: రెండు కర్టెన్లు, సైడ్ ఎయిర్ బ్యాగులు, మూడు పాయింట్ల సీట్ బెల్ట్, ముందు వైపున బెల్ట్ టెన్షనర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఎన్నో భద్రత ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంటీరియర్
ఈ బీటిల్ కారు ఇంటీరియర్‌లో ఎనిమిది స్పీకర్లు గల సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వియన్నా లెథర్ సీట్లు, మల్టీ ఫంక్షన్ స్డీరింగ్ వీల్, మల్టీ ఫంక్షన్ డిస్ల్పే, ఆడియో మరియు టెలిఫోన్ కంట్రోల్స్ ఇందులో ఉన్నాయి.

ధర
ఈ 21 వ శతాబ్ధపు వోక్స్‌వ్యాహన్ బీటిల్ కారు ధర రూ. 28.73 లక్షలు ఎక్స్-షోరూమ్, ముంబాయ్ గా ఉంది.

లభించు రంగులు
ఈ సరి కొత్త వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు నాలుగు విభిన్న రంగుల్లో లభించును
- ఆరేంజ్
- నీలం
- ఎరుపు
- తెలుపు



Click it and Unblock the Notifications








