బీటిల్ మోడల్ కారును భారత దేశానికి దిగుమతి చేయనున్న వోక్స్‌వ్యాగన్
వోక్స్‌వ్యాగన్ ఆటోమొబైల్ సంస్థ త్వరలో తన బీటిల్ రకం కారును ఇండియాకి దిగుమతి చేసుకుని అమ్మకాలు సాగించనుంది. ఇది కంప్లీట్లి బిల్ట్ యూనిట్ కారు అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ బీటిల్ కారును ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకు రానున్నారు.
Also Read: సరి కొత్త ల్యాండ్ క్రూయిజర్‌ను విడుదల చేసిన టయోటా: ధర రూ. 1.29 కోట్లు.
బీటిల్ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌ల నుండి తెలుసుకుందాం రండి.

బీటిల్ పోర్ట్‌ఫోలియో
వోక్స్ వ్యాగన్ ఇంతకు ముందు భారత్‌లో అమ్మకాలు సాగించేది. అయితే అప్పట్లో అమ్మకాలు తక్కువగా ఉండటం వలన ప్రస్తుతం మార్కెట్ నుండి వాటిని తొలగించింది.

ఇంజన్
కొత్త బీటిల్ కారులో 1.4-లీటర్ టియస్‌ఐ పెట్రోల్ ఇంజన్ కలదు ఇది దాదాపుగా 158బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో కోసం ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను అందించారు.

పోటి
ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బియమ్‌డబ్ల్యూ యొక్క ఫస్ట్ సిరీస్ కార్లకు, మెర్సిడెస్ బెంజ్ ఎ క్లాస్ కార్లకు, మిని కూపర్, మరియు ఫియట్ 500 వంటి ఉన్నత స్థాయి కార్లకు పోటిగా నిలవనుంది.

ధర
వోక్స్‌వ్యాగన్ కు చెందిన బీటిల్ కారు ధర రూ. 20 లక్షల నుండి 30 లక్షల రుపాయల మధ్య ఉండనుంది.

విసృత శ్రేణిలో లభించే రంగులు
ఈ బీటిల్ కారును విసృత శ్రేణి గల రంగుల్లో అందిస్తున్నారు. మరియు దీనిని అంతర్జాతీయ మార్కెట్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నట్లు తెలిపారు. భారత దేశంలో యువకులను టార్గెట్ చేసి వీటిని అందుబాటులోకి తీసుకువస్తోంది.

డిమాండ్ దృష్ట్యా
వోక్స్‌వ్యాగన్ తన అన్ని హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను ఇండిలో విడుదల చేయడానికి ఎలాంటి అభ్యతరం లేదన్నారు. అయితే డిమాండ్ మోడళ్లను మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

లగ్జరీ కార్ మార్కెట్
భారతీయ మార్కెట్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే వృద్ది చెందుతున్నాయని. అందులో వోక్స్‌వ్యాగన్ తన బీటిల్ కారును ప్రవేసపెట్టి భాగస్వాములవుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలియజేశారు

- రాయల్ ఎన్ఫీల్డ్ వర్సెస్ బజాజ్ అవెంజర్ : ఇందులో దేనికి మీ ఓటు
- పుంటో స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్‌ని విడుదల చేసిన ఫియట్ మోటార్స్(ధర, ఫీచర్స్, మరింత సమాచారం)
- టోక్యో మోటర్ షోలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువిని ఆవిష్కరించిన మిత్సుబిషి


Click it and Unblock the Notifications








