ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఏడు కొత్త కార్లు: పూర్తి వివరాలు

Written By:

త్వరలో ఓ కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా...? అయితే కొత్త కారు కొనేముందు త్వరలో మార్కెట్లోకి కొత్త ఏవైనా కార్లు విడుదలవుతున్నాయా అని ఓ సారి చెక్ చేసుకోండి. ఎందుకుంటే ఆత్రం మీద కారు కొనేసిన తరువాత నూతన కార్లు విడుదలయితే, దీనిని కొనిఉంటే బాగుండు అని నిరుత్సాహపడాల్సి వస్తుంది. కాబట్టి పాఠకుల కోసం... ఏప్రిల్ 2017 నెలలో మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్ల గురించి పూర్తి వివరాలు.....

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

ఆడి ఏ3

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ మరియు ఖరీదైన కార్ల తయారీ సంస్థ ఆడి, ఇండియా విభాగం తమ ఎంట్రీ లెవల్ సెడాన్ ఏ3 కారుకు అప్‌గ్రేడ్స్ నిర్వహించి భారీ కాస్మొటిక్ మార్పులతో ఏప్రిల్ 6, 2017 న మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

ల్యాంబోర్గిని పర్ఫా‌మెంట్

దేశీయ కార్ల మార్కెట్ వేగంగా వృద్ది చెందుతోందనడానికి మరో ఇది ఉదాహరణ. దేశీయంగా సూపర్ కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ దిగ్గజం ల్యాంబోర్గిని ఇండియన్ మార్కెట్లోకి తమ హురాకాన్ పర్ఫా‌మెంట్ కారును ఏప్రిల్ 7, 2017 విడుదలకు ఖరారు చేసింది. చిన్న కార్ల మార్కెట్ మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన శక్తివంతమైన కార్ల మార్కెట్‌కు కూడా ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయి.

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

వోల్వో ఎస్60 పోల్‌స్టార్

స్వీడిష్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎట్టకేలకు తమ శక్తివంతమైన కారు బ్రాండ్ పోల్‌స్టార్‌ను దేశీయంగా పరిచయం చేయడానికి సిద్దం అయ్యింది. వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్ కారును వచ్చే ఏప్రిల్ 14, 2017 తేదీన విపణిలోకి విడుదల చేయనుంది.

ఎస్60 పోల్‌స్టార్

ఎస్60 పోల్‌స్టార్

వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్‌లో శక్తివంతమైన 2-లీటర్ల సూపర్ ఛార్జ్‌డ్ మరియు టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 362బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. పోల్‌స్టార్ సెడాన్‌ను ఆల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా ఎంచుకోవచ్చు.

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

డాట్సన్ గో మరియు గో ప్లస్ యానివర్సరీ ఎడిషన్

డాట్సన్ ఇండియా తమ గో మరియు గో ప్లస్ హ్యాచ్‌బ్యాక్ కార్లను వార్షికోత్సవ ఎడిషన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. నాలుగు సంతవ్సరాల నుండి దేశీయ మార్కెట్లో కొనసాగుతున్నందున వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటా ఈ రెండు వేరియంట్లను డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ మరియు ఇతర అప్‌గ్రేడ్స్‌‌తో యానివర్సరీ ఎడిషన్ వేరియంట్లుగా విడుదల చేసే అవకాశం ఉంది.

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా తమ ఇన్నోవా ఎమ్‌యూవీ స్థానంలోకి ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని గత ఏడాది విడుదల చేసింది. అయితే ఇన్నోవా క్రిస్టా లోని టాప్ ఎండ్ వేరియంట్‌ను టూరింగ్ స్పోర్ట్ ఆప్షన్‌లో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఇందులో సరికొత్త బ్లాక్ స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ మరియు అదనపు ఇంటీరియర్ ఫీచర్లు రానున్నాయి.

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

జీప్ కంపాస్

జీప్ ఇండియా విభాగం తమ అతి చిన్న ఎస్‌యూవీ కంపాస్‌ను వచ్చే ఏప్రిల్ 12, 2017 న విపణిలోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న చిన్న ఎస్‌యూవీలను ఎదుర్కునేందుకు అమెరికా తయారీ సంస్థ ధరలను ఎలా నిర్ణయిస్తుందనేది ఆసక్తిగా ఎదురుచూడాల్సిన అంశం.

ఏప్రిల్ 2017 లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను ఈ ఏప్రిల్ చివరి నాటికి లేదా మే నెల ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

 
English summary
Also Read In Telugu: 7 Cars Set To Launch In India In April 2017, list of up coming cars in april 2017 into indian market. list of upcoming car details in telugu
Story first published: Wednesday, April 5, 2017, 13:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark