రంజిత్ సుందరమూర్తికి బెంగళూరు వీధుల్లో బ్రహ్మరథం పట్టారు
భారతదేశపు తొలి మెక్‌లారెన్ కారును బెంగళూరు యువకులు వందల సంఖ్యలో వెంబడించారు.
కొన్ని రోజుల క్రితం భారతదేశపు తొలి మెక్‌లారెన్ కారు ఇండియన్ రోడ్ల మీదకు అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ రంజిత్ సుందరమూర్తి మెంపిస్ రెడ్ కలర్‌లో ఉన్న మెక్‌లారెన్ 720ఎస్ కారును బెంగళూరుకు తెప్పించాడు.

మెక్‌లారెన్ 720ఎస్ ఓనర్ ఈ మధ్య బెంగళూరు వీధుల్లో షికారుకు ఈ కారును బయటకు తెచ్చాడు. అంతే, ఆలస్యం లేకుండా బెంగళూరు యువత ఆ కారు వెనుకపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే సెలబ్రిటీని చుట్టుముట్టినట్లు కారు మొత్తాన్ని ఆవహించేశారు.
Recommended Video


జలికట్టు తరహా ఎద్దును కట్టడి చేసే రీతిలో ఈ బ్రిటీష్ కారు వెనుక వందల సంఖ్యలో యువత కెమెరాలతో వెంటబడ్డారు. ప్రతి సిగ్నల్ వద్ద, ప్రతి మలుపులో మెక్‌లారెన్ ఫోటోలను తమ కెమెరాలో బంధించేశారు.

మెక్‌లారెన్ 720ఎస్ కారులో ఉన్న గరిష్ట యాక్సిలరేషన్(2.9 సెకండ్లలో 0-100కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం) ఈ కారు ఓనర్‌కు బెంగళూరు స్ట్రీట్స్‌లో బాగా ఉపయోగపడింది. మరియు ఇది ఉత్పత్తి చేసే 710బిహెచ్‌పి పవర్ మరియు 770ఎన్ఎమ్ టార్క్ దీన్ని చుట్టిముట్టిన గుంపును క్షణాల్లో అధిగమించుకుంటూ వెళ్లిపోయింది.

చిన్న బైకులు, స్కూటర్ల నుండి సూపర్ బైకుల వరకు యువత తమ డిఎల్ఆర్ కెమెరాలను మెడలో వేసుకుని, ఫోన్ కెమెరాలను వెంటబెట్టుకుని అతి కష్టంగా రైడింగ్ చేస్తూ మెక్‌లారెన్ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూనే తమ కెమెరాలతో మెక్‌లారెన్ ఫోటోలను క్లిక్‌మనిపించారు. మరి కొంత మంది సిగ్నల్స్ వద్ద మెక్‌లారెన్‌తో పోజులిస్తూ, ఫోటోలు దిగారు.

ఇండియాలో మెక్‌లారెన్‌కు ఈ తరహా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం మెక్‌లారెన్ వెనుక యువత ఇంతలా వెంటపడేంత వరకు తెలియదు. మొత్తానికి ఇండియాలో సాధారణ యువత నుండి సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తల వరకు మెక్‌లారెన్‌కు ఫ్యాన్స్ కానివారంటూ ఎవ్వరూ ఉండురు!


Click it and Unblock the Notifications