ఇండియాలో జీప్ కంపాస్ మరో అరుదైన రికార్డ్

Written By:

అమెరికన్ లగ్జరీ ఎస్‌యూవీ వాహనల తయారీ దిగ్గజం జీప్‌కు ఇండియన్ మార్కెట్లో భారీ స్పందన లభిస్తోంది. సరికొత్త జీప్ కంపాస్ మీద జూన్ 19 న అధికారిక బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మరియు జూలై 31 న విపణిలోకి విడుదలయ్యింది. విడుదల ముందు నుండే కంపాస్ మీద మార్కెట్లో అంచనాలు భారీగా పెరిగాయి, దీంతో కంపాస్ మీద భారీ బుకింగ్స్ నమోదవుతున్నాయి.

జీప్ కంపాస్ బుకింగ్స్

కేవలం విడుదలైన నెల రోజుల్లోపే జీప్ కంపాస్ మీద 10,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. కంపాస్ మీద బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి విడుదల మధ్య కాలంలోనే 5,000 లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు జీప్ ఇండియా వెల్లడించింది.

జీప్ కంపాస్ బుకింగ్స్

కంపాస్ మీద బుకింగ్స్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ కూడా అధికమవుతోంది. ఇందు కోసం జీప్ భాగస్వామ్యపు సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ దేశీయంగా ఉన్న రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో వారానికి ఆరు రోజులు, రోజుకి రెండు షిఫ్టుల్లో డిమాండ్‌కు సరిపడా కంపాస్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తోంది.

జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ కంపాస్ విడుదలైనప్పటి నుండి కంపాస్ మీద ఎంక్వైరీలు భారీగా నమోదవుతున్నాయి. బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 92,000 లకు పైగా విచారణలు వచ్చినట్లు జీప్ పేర్కొంది.

జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ దేశీయంగా తమ తొలి ఎస్‌యూవీగా కంపాస్‌ను ఇండియాలో ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఎవ్వరూ ఊహించని ధరలతో కంపాస్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జీప్ కంపాస్‌లో పది విభిన్న వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ కంపాస్ ధర రూ. 14.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20.65 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

జీప్ కంపాస్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ కంపాస్ ఇండియన్ మార్కెట్లోకి వస్తోందని అని తెలిసినప్పుడు, ఇది ఇంత విజయాన్ని అందుకుంటుందని ఎవరూ ఊహించుండరు. ఏదేమైనప్పటికీ అత్యుత్తమ నిర్మాణ విలువలతో, బ్రాండ్ వ్యాల్యూతో, శక్తివంతమైన ఇంజన్, అధునాతన ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లతో కంపాస్ తిరుగులేని సక్సెస్ అందుకుంది.

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu: Jeep Compass India Bookings Hits 10000 Mark
Story first published: Saturday, September 2, 2017, 11:53 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark