రూ. 14.95 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన జీప్ కంపాస్

Written By:

ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో తీవ్ర ఉత్కంఠాన్ని రేపిన జీప్ కంపాస్ ఎట్టకేలకు నేడు(31 జూలై, 2017) విపణిలోకి విడుదలయ్యింది. కంపాస్ పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 14.95 లక్షలు మరియు కంపాస్ డీజల్ 4X4 టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20.65 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

జీప్ కంపాస్ విడుదల

జీప్ ఇండియా విభాగంలో అత్యంత చవక ఎస్‌యూవీ కంపాస్ మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, స్పోర్ట్, లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్. ఆల్ వీల్ డ్రైవ్(4x4) సిస్టమ్ కేవలం డీజల్ వేరియంట్లలో మాత్రమే ఆప్షనల్‌గా లభిస్తోంది. కంపాస్ లోని పెట్రోల్ వేరియంట్లలో ఫ్రంట్ డ్రైవ్ సిస్టమ్ కలదు.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ డిజైన్

జీప్ కంపాస్ డిజైన్ విషయంలో అద్బుతం చేసిందని చెప్పాలి. జీప్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గ్రాండ్ చిరోకీ ఆధారంగా కంపాస్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. కంపాస్ ఫ్రంట్ డిజైన్‌లోని సెవెన్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్ మరియు ఎలాంటి అదనపు సొబగులు, ఆరంబడాలు లేని డీసెంట్ డిజైన్ దీని సొంతం.

జీప్ కంపాస్ విడుదల

ఫ్రంట్ గ్రిల్‌లోని ప్రతి స్లాట్లో క్రోమ్ పట్టీ గల గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ కలదు. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ రెండు ఫాగ్ ల్యాంప్స్‌కు మధ్యలో ఉంది.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ డీజల్ వేరియంట్ల ధరలు

స్పోర్ట్ రూ. 15,45,000 లు
లాంగిట్యూడ్ రూ. 16,45,000 లు
లాంగిట్యూడ్ ఆప్షన్ రూ. 17,25,000 లు
లిమిటెడ్ రూ. 18,05,000 లు
లిమిటెడ్ ఆప్షన్ రూ. 18,75,000 లు
లిమిటెడ్ 4x4 రూ. 19,95,000 లు
లిమిటెడ్ ఆప్షన్ 4x4 రూ. 20,65,000 లు
జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

  • స్పోర్ట్ రూ. 14,95,000 లు
  • లిమిటెడ్ రూ. 18,70,000 లు
  • లిమిటెడ్ ఆప్షన్ రూ. 19,40,000 లు

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ సైడ్ ప్రొఫైల్

జీప్ కంపాస్ ప్రక్కవైపు డిజైన్‌లో క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. ట్రెపిజోయిడల్ వీల్ ఆర్చెస్ గల 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఫైర్ స్టోన్ టైర్లను కలిగి ఉన్నాయి. స్లోపింగ్ రూప్ మొత్తం క్రోమ్ రూఫ్ లైన్ కలదు. రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్‌తో పాటు జీప్ మరియు 4x4 బ్యాడ్జెస్ ఉన్నాయి.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ ఇంటీరియర్

ఇంటీరియర్‌ మొత్తాన్ని డ్యూయల్ టోన్ థీమ్‌తో రూపొందించింది. సీట్లు మరియు రూఫ్ లను జీప్ స్కై-గ్రే పేరుతో పిలిచే వైట్ కలర్ రూపొందించగా, డ్యాష్ బోర్డు మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉంది. వెనుక సీటులో మధ్యలో ఉన్న ఆర్మ్ రెస్ట్ మీద రెండు కప్ హోల్డర్స్ ఉన్నాయి.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్, యుఎస్‌బి, ఏయుఎక్స్ ఇన్‌పుట్ లను సపోర్ట్ చేయగల 5-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇందులో న్యావిగేషన్ ఫీచర్ లేదు, అయితే వెహికల్‌లో కంపాస్(దిక్సూచి) అందివ్వడం జరిగింది.

జీప్ కంపాస్ విడుదల

డ్యూయల్ జోన్ ఎయిర్ కండీషనింగ్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, మరియు ఆటో ఫోల్డింగ్ అవుటర్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి. జీప్ వారి సెలక్ టెర్రైన్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గేర్‌నాబ్‌కు ముందు వైపున అందించారు.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ ఇంజన్ వివరాలు

సాంకేతికంగా జీప్ కంపాస్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తోంది. కంపాస్‌ ఎస్‌యూవీలోని 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో-డీజల్ ఇంజన్ గరిష్టంగా 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.4-లీటర్ సామర్థ్యం గల టుర్బో-పెట్రోల్ ఇంజన్ 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ ట్రాన్స్‌మిషన్ వివరాలు

కంపాస్ పెట్రోల్ వెర్షన్ 7-స్పీడ్ డిడిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించును. కంపాస్‌లోని డీజల్ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. లిమిటెడ్ 4x4 వేరియంట్లో జీప్ సెలెక్-టెర్రైన్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్స్‌ కలిగి ఉంది. డ్రైవింగ్ మోడ్స్ - ఆటో, స్నో, శాండ్ మరియు మడ్. వీటిలో ఒక మోడ్ ఎంచుకుని అందుకు అనుగుణంగా ట్రాక్షన్ కంట్రోల్ చేసే వ్యవస్థ ఇందులో ఉంది.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్‌లో ముందు వైపున మెక్‌పర్సన్ స్ట్రట్స్ మరియు వెనుక వైపున కోని మరియు ఛాంప్‌మ్యాన్ లింక్ సెటప్ కలదు. దీంతో అత్యుత్తమ రైడ్ మరియు హ్యాండ్లింగ్ సాధ్యమవుతుంది. జీప్ కంపాస్ 178ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు మరియు 480ఎమ్ఎమ్ లోతు వరకు నీటిలో వెళ్లగలదు.

జీప్ కంపాస్ విడుదల

జీప్ కంపాస్ ఎస్‌యూవీలోని భద్రత ఫీచర్లు

కంపాస్ ఎస్‌యూవీలో సేఫ్టీ ఫీచర్లను అందివ్వడంలో జీప్ ఎక్కువ దృష్టిసారించింది. ఇందులో డ్యూయల్ స్టేజ్ ఆక్టివేషన్‌తో ఆరు ఎయిర్ బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కీలెస్ గో మరియు ప్యాసివ్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, రివర్స్ పార్క్ అసిస్ట్ సెన్సార్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జీప్ కంపాస్ విడుదల

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సబ్ బ్రాండ్ మోపార్‍ను తీసుకొచ్చింది. కంపాస్ ఎస్‌యూవీ మీద ఉచిత ఇన్సూరెన్స్ , మెయింటనెన్స్, సర్వీసింగ్ వంటివి అందిస్తోంది. మరియు మూడేళ్ల పాటు ఉచిత రోడ్ సైట్ అసిస్టెన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. 40 రోజుల్లో 38,000 మంది కంపాస్ గురించి విచారించగా, అందులో 5,000 బుకింగ్స్ నమోదయ్యాయి.

డీజల్ కంపాస్ వేరియంట్లను వెంటనే డెలివరీ ఇవ్వనున్నట్లు జీప్ పేర్కొంది. అయితే, కంపాస్ పెట్రోల్ వేరియంట్లను పండుగ సీజన్ నుండి మాత్రమే డెలివరీ ఇవ్వనుంది.

English summary
Read In Telugu: Jeep Compass Launched In India; Priced At 14.95 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark