కంపాస్ ఎస్‌యూవీ ఇండియా విడుదల తేదీ ఖరారు చేసిన జీప్

Written By:

జీప్ ఇండియా విభాగం తమ కంపాస్ ఎస్‌యూవీ విడుదల తేదీని ప్రకటించింది. జూలై 31,2017 రోజున ఇండియన్ మార్కెట్లోకి జీప్ తమ ఎంట్రీ లెవల్ కంపాస్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. కంపాస్ ఎస్‌యూవీ మీద జూన్ లోనే బుకింగ్స్ ప్రారంభించింది.

జీప్ ఆఫీషియల్ వెబ్‌సైట్ మరియు జీప్ డీలర్ల వద్ద బుకింగ్ ఫీజు చెల్లించి కంపాస్‌ను బుక్ చేసుకోవచ్చు. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ కంపెనీ రాజస్థాన్‌లోని తన రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఇప్పటికే కంపాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ ప్రారంభించింది.

ఐదు విభిన్న వేరియంట్లలో, ఐదు విభిన్న రంగుల ఆప్షన్స్ అదే విధంగా రెండు ఇంజన్ ఆప్షన్‌లతో పాటు టూ వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో కంపాస్ ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు.

ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లోని అవకాశాలను దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు అందిపుచ్చుకుని తమదైన శైలిలో ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎస్‌యూవీ మార్కెట్‌ను పూర్తిగా తన వశం చేసుకోవడం ఖాయమనిపిస్తోంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ సాంకేతికంగా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ డీజల్ ఇంజన్ 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

అదే విధంగా కంపాస్ ఎస్‌యూవీలోని 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

జీప్ ఇండియా విభాగం నుండి తాజాగా అందుతున్న సమాచారం మేరకు, కంపాస్‌ ఎస్‌యూవీ తొలుత డీజల్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో విడుదలయ్యి, ఆలస్యంగా పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్‌లో విడుదల కానుంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీకి పోటీగా ఉన్న వెహికల్స్‌ను గమనిస్తే, ప్రస్తుతం దేశీయ విపణిలో హ్యుందాయ్ టుసాన్, హోండా సిఆర్-వి, ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ లతో పాటు వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లు ఉన్నాయి.

అన్ని పోటీదారులను ఎదుర్కునే విధంగా జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీని ధరలను నిర్ణయించనుంది. జూలై 11, 2017 న విడుదల కానున్న జీప్ ఎస్‌యూవీ గురించి పూర్తి కవరేజ్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu: Made-in-India' Jeep Compass India Launch Date Revealed
Story first published: Tuesday, July 11, 2017, 17:57 [IST]
Please Wait while comments are loading...

Latest Photos