మహీంద్రా టియువి300 ప్లస్ ఇంజన్, ఫీచర్లు, ధర మరియు ఫోటోలు

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా గతంలో లాంచ్ చేసిన టియువి300 ఎస్‌యూవీ యొక్క పొడవాటి వెర్షన్‌ను అభివృద్ది చేసింది. అదనపు సీటింగ్ వరుసతో,  అధిక వీల్ బేస్ గల ఈ వెర్షన్‌కు టియువి300 ప్లస్ అనే పేరు పెట్టింది.

మహీంద్రా టియువి300 ప్లస్

పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించి ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌ను పూర్తి స్థాయిలో సిద్దం చేసింది. మహీంద్రా ఈ టియువి300 ప్లస్ ఎస్‍‌యూవీని 2018లో మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. అయితే, ఈ నేపథ్యంలో ఏఆర్ఏఐ వద్ద నిర్ధారణ పరీక్షలకు వచ్చిన టియువి300 ప్లస్ టెక్నికల్ ఫీచర్లు మరియు ఇతర వివరాలు లీకయ్యాయి. ఆ వివరాలు మీ కోసం...

Recommended Video - Watch Now!
Best Cars Of 2017 In India - DriveSpark
మహీంద్రా టియువి300 ప్లస్

మహీంద్రా టియువి300 ప్లస్ మోడల్ రెగ్యులర్ మోడల్ కన్నా ఎక్కువ పొడవుగా ఉంది. దీని పొడవు 4,398ఎమ్ఎమ్, వెడల్పు 1,815ఎమ్ఎమ్, ఎత్తు 1,837ఎమ్ఎమ్‌గా ఉంది. సాధారణ టియువి300తో పోల్చుకుంటే దీని పొడవు 403ఎమ్ఎమ్ అధికంగా ఉంది. మరియు దీని మొత్తం బరువు 2,430కిలోలుగా ఉంది.

మహీంద్రా టియువి300 ప్లస్

మహీంద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీలో 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ 120 డీజల్ ఇంజన్ కలదు. 118.35బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభించనుంది.

మహీంద్రా టియువి300 ప్లస్

మహీంద్రా తమ టియువి300 ప్లస్ వాహనంలో తొమ్మిది మంది కూర్చునే సీటింగ్ లేఔట్ అందించింది. వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అధికారికంగా విడుదల చేయనున్న మహీంద్రా ప్రస్తుతం కొంత మంది ఎంచుకోదగ్గ కస్టమర్లకు డెలివరీ కూడా ఇస్తోంది.

Trending On DriveSpark Telugu:

భర్తకు భలే కానుకిచ్చిన జెనీలియా

2018 జనవరిలో విడుదలవుతున్న కొత్త కార్లు

ఎదురుచూపులకు పులిస్టాప్ పెట్టండి: సరికొత్త 2018 స్విఫ్ట్ వచ్చేసింది!!

మహీంద్రా టియువి300 ప్లస్

తాజాగా, మహీంద్రా టియువి300 ప్లస్ లోని పి4 వేరియంట్‌ను తమిళనాడులోని ఓ కస్టమర్‌కు డెలివరీ చేసింది. పొడవాటి యుటిలిటి వెహికల్ 9-సీటింగ్ కెపాసిటి గల పి4 వేరియంట్‌ను రూ. 9.46 లక్షల ఎక్స్-షోరూమ్‌తో విక్రయించింది.

మహీంద్రా టియువి300 ప్లస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటి విభిన్న రకాల యుటిలివిటి వాహనాలను అందుబాటులో ఉంచిన మహీంద్రా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఇప్పుడు తమ టియువి300 వెహికల్‌ను పొడవాటి వెర్షన్‌లో టియువి300 ప్లస్ పేరుతో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ధరకు తగ్గ విలువలతో దీనిని అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పవచ్చు.

Image Courtesy: TUV300/Ravi Shankar

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Mahindra TUV300 Plus Specifications Leaked Ahead Of Launch
Story first published: Thursday, December 28, 2017, 18:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark