డస్టర్ భరతం పడుతున్న మారుతి ఎస్-క్రాస్ సేల్స్

Written By:

మారుతి సుజుకి నెక్సా షోరూమ్ ద్వారా ప్రవేశపెట్టిన తొలి ఎస్-క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ. విడుదలైన తొలినాళ్లలో ఆశించిన ఫలితాలు కనబరచకపోవడంతో తీవ్ర నిరాశను మిగిల్చింది.

మారుతి ఎస్-క్రాస్

అయితే, ఇటీవల మారుతి ఎస్-క్రాస్ క్రాసోవర్‌ ఎస్‌యూవీలో భారీ మార్పులు జరిపి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రీలాంచ్ చేసింది. అనతి కాలంలో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ మంచి విజయాన్ని అందుకుంది. భారీ బుకింగ్స్‌తో రెనో మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ డస్టర్‌ను సేల్స్‌ పరంగా వెనక్కి నెట్టేసింది.

Recommended Video - Watch Now!
[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
మారుతి ఎస్-క్రాస్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ విడుదలైనప్పటి నుండి 40 రోజులలో 11,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది. మరియు గడిచిన అక్టోబరు 2017 నెలలో 5,510 ఎస్-క్రాస్ ఎస్‌యూవీలను డెలివరీ ఇచ్చింది.

మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు దగ్గరగా ఉన్న డస్టర్ 919 యూనిట్లు మరియు టెర్రానో 236 యూనిట్ల సేల్స్‌కు మాత్రమే పరిమితం కావడంతో ఎస్-క్రాస్ విక్రయాల పరంగా విజృంభించింది.

మారుతి ఎస్-క్రాస్

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఇష్టపడనిదే వేల సంఖ్యలో సేల్స్ సాధ్యం కావు కదా... ఒక రకంగా ఇది ఎస్-క్రాస్ ఎస్‌యూవీని మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీగా నిలిపేందుకు శుభసూచకం కానుందని చెప్పవచ్చు.

మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీలో 1.3-లీటర్ కెపాసిటి గల ఫియట్ మల్టీజెట్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో వాహనాల్లో ఉండే ఇంజన్ కంటే తక్కువ శక్తివంతమైనది.

మారుతి ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ క్రాసోవర్‌కు పోటీగా చెప్పుకునే ఎస్‌యూవీలలో పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు కూడా ఉన్నాయి. అయితే, ఎస్-క్రాస్‌లో డీజల్ ఇంజన్ మరియు కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఉంది.

మారుతి ఎస్-క్రాస్

మారుతి సుజుకి వచ్చే ఏడాదిలో 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ పరిచయం చేసే అవకాశం ఉంది. 108బిహెచ్‍పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఇంజన్‌కు ఎమ్15ఎ కోడ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మారుతి ఎస్-క్రాస్

మారుతి ఇప్పటికే ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్‌ను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ఎగుమతులు మరియు దేశీయ విక్రయాలు పెరిగే మారుతి సుజుకి మొత్తం విక్రయాల్లో ఎస్-క్రాస్ మంచి వాటాను సొంతం చేసుకోనుంది.

మారుతి ఎస్-క్రాస్

తాజాగా విపణిలోకి విడుదల చేసిన ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ విషయానికి వస్తే, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, కండలు తిరిగిన శరీరాకృతితో అగ్రెసివ్ డిజైన్‌ను కలిగి ఉంది.

మారుతి ఎస్-క్రాస్

మెరుగైన మైలేజ్ కోసం ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందివ్వడం జరిగింది. మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ధరల శ్రేణి రూ. 8.49 లక్షల నుండి రూ. 11.29 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది. నెక్సాన్ షోరూమ్‌లో పరాభవం ఎదుర్కొన్న ఎస్-క్రాస్ మళ్లీ నెక్సా స్టోర్ నుండి సక్సెస్ అందుకొంది.

English summary
Read In Telugu: Maruti S-Cross Facelift clocks 11k bookings; Beats Renault Duster compact SUV in sales
Story first published: Friday, November 17, 2017, 11:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark