మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ విషయంలో మరో రూమర్: నిజమైతే ఎంత బాగుటుందో...!!

Written By:

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ను ఈ పండుగ సీజన్ నాటికి విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంటోంది. అయితే సరికొత్త ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లలో మాత్రమే విడుదల కానున్నట్లు సమాచారం.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ కేవలం ఒక్క డీజల్ ఇంజన్ వేరియంట్లోనే విడుదల కానుందనే సమాచారం ప్రకారం, ఇది 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లో మాత్రమే లభించనుంది. అయితే గతంలో లభించే 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌ ఇందులో రావడం లేదు.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఓ ఆన్‌లైన్ వార్తా వేదిక తెలిపిన కథనం మేరకు, 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఎస్-క్రాస్ ను మారుతి సుజుకి విపణి నుండి తొలగించనుందని మరియు ఇప్పటికే మారుతి ఈ 1.6-లీటర్ ఎస్-క్రాస్ ఉత్పత్తిని కూడా నిలిపివేసినట్లు పేర్కొంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

అదనంగా, మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆటోప్రేమికుల్లో ఉన్న విభిన్న కస్టమర్లను చేరుకునేందుకు ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో విభిన్న ఇంజన్ ఆప్షన్‌లను పరిచయం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ గత పనితీరును గమనించిన మారుతి కేవలం సింగల్ ఇంజన్ వేరియంట్లోనే విడుదల చేయనుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

అంతర్జాతీయ విపణిలో ఉన్న ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, నూతన డిజైన్‌లో ఉన్న హెడ్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్లు ఉన్నాయి. ఇదే మోడల్‌ను దేశీయ విపణిలోకి ఫేస్‌లిఫ్ట్‌తగా ప్రవేశపెట్టనుంది. పూర్తి స్థాయిలో క్రాసోవర్ రూపంలోకి మారిపోయిందని చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఫీచర్లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లలో మారుతి నూతనంగా అభివృద్ది చేసిన సరికొత్త మోడళ్లలో ఉన్న ఇంటీరియర్ ఫీచర్లను అందివ్వనుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీలో 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ అందివ్వడం దాదాపు సాధ్యమయ్యే పనే. ఈ ఇంజన్ అందివ్వడంతో ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ధర గణనీయంగా దిగిరానుంది. నిజానికి ఇది సామ్యాన్య కస్టమర్లకు గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు.

English summary
Read In Telugu: Maruti S-Cross Facelift To Be Offered Only With A Single Diesel Engine Option
Story first published: Friday, September 1, 2017, 10:49 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark