పది అదనపు ఫీచర్లతో ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్ విడుదల

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో లోని కె10 మోడల్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా ఆల్టో కె10 ప్లస్ పేరుతో విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.40 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో కె10 ప్లస్ మోడల్ టాప్ ఎండ్ వేరియంట్ అయిన విఎక్స్ఐ లోనే మాత్రమే లభించును, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మీద కె10 ప్లస్ ఎడిషన్‌లో పది అదనపు ఫీచర్లను అందివ్వడం జరిగింది.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

ఎక్ట్సీరియర్ మీద, క్రోమ్ పూత పూయబడిన ఫాగ్ ల్యాంప్ తొడుగులు, క్రోమ్ వీల్ ఆర్చెస్, పార్కింగ్ సెన్సార్లు, రియర్ స్పాయిలర్, బాడీ కలర్‌లో ఉన్న డోర్ హ్యాండిల్స్ కలవు.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

ఆల్టో కె10 ప్లస్ ఇంటీరియర్‌లో అందించిన ఫీచర్ల విషయానికి వస్తే, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ మరియు పియానో ఫినిషింగ్ చేయబడిన ఆడియో కన్సోల్ వంటివి ఉన్నాయి.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

సాంకేతికంగా ఇందులోని ఇంజన్‌కు ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి అదే 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

ఈ ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్ కారును 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల గేర్‌బాక్స్ ఆప్షన్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో ఉన్న రెనో క్విడ్ 1.0-లీటర్ వేరియంట్‌కు బలమైన పోటీనివ్వనుంది. మారుతి సుజుకి ఎప్పటిలాగే బెస్ట్ కార్ల తయారీ సంస్థగా నిలవడానికి ఇలాంటి ఉత్పత్తులను విడుదల చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మారుతి ఆల్టో కె10 ప్లస్ ఎడిషన్

మీకు నచ్చిన మారుతి సుజుకి కార్లకు చెందిన సమస్త సమాచారం తెలుగులో తెలుసుకోండి అదే విధంగా మీకు నచ్చిన నగరంలో మారుతి సుజుకి కార్ల ఆన్ రోడ్ మరియు ఎక్స్-షోరూమ్ ధరలను తెలుసుకోండి....

 

English summary
Maruti Suzuki Alto K10 Plus Edition Launched In India
Story first published: Friday, March 24, 2017, 15:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark