మారుతి సియాజ్ ఎస్ సెడాన్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

మారుతి సుజుకి విపణిలోకి సియాజ్ ఎస్ సెడాన్ కారును విడుదల చేసింది. మారుతి సియాజ్ ఎస్ ప్రారంభ ధర రూ. 9.39 లక్షలు

By Anil

భారతదేశపు దిగ్గజ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి సియాజ్ ఎస్ సెడాన్ కారును విడుదల చేసింది. సియాజ్ ఇప్పటికే దేశీయ విపణిలో విక్రయాల్లో ఉంది. అయితే ఇందులోకి సియాజ్ ఎస్ వేరియంట్‌ను ప్రేవేశపెట్టింది.

మారుతి సియాజ్ ఎస్

  • మారుతి సుజుకి సియాజ్ ఎస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 9.39 లక్షలు
  • మారుతి సుజుకి సియాజ్ ఎస్ డీజల్ వేరియంట్ ధర రూ. 11.55 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్-షోరూమ్‌(ఇండియా)గా ఇవ్వబడ్డాయి.

    Recommended Video

    2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
    మారుతి సియాజ్ ఎస్

    రెగ్యులర్ వెర్షన్ సియాజ్ సెడాన్‌తో పోల్చుకుంటే సియాజ్ ఎస్ వేరియంట్ ఎక్ట్సీరియర్ మీద అనేక కాస్మొటిక్ సొబగులను కలిగి ఉంది. స్పోర్టివ్ ఫీల్ కలిగే విధంగా సియాజ్ ఎస్ వేరియంట్ ముందువైపు మరియు వెనుక వైపున స్పోర్టివ్ బంపర్లు, స్పోర్టివ్ స్పాయిలర్(డిక్కీ మీద అందించిన పార్ట్), సైడ్ స్కర్ట్స్ ద్వారా రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చితే సియాజ్ ఎస్ ఓవరాల్ డిజైన్ అగ్రెసి‌వ్‌గా ఉంది.

    మారుతి సియాజ్ ఎస్

    సియాజ్ ఎస్ నిజానికి సియాజ్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా ఆధారంగా అభివృద్ది చేయబడింది. బ్లాక్ ఇంటీరియర్స్, గ్రే మరియు క్రోమ్ ఇన్సర్ట్స్, మరియు సీట్లను కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో అందివ్వడం జరిగింది. వీటిన్నింటి మేళవింపు ఇంటీరియర్ మొత్తంలో ప్రీమియమ్ ఫీల్‌ను కల్పిస్తోంది.

    మారుతి సియాజ్ ఎస్

    సాంకేతికంగా సియాజ్ ఎస్ లోని 1373సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 91బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు 1248సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ గరిష్ఠంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    మారుతి సియాజ్ ఎస్

    మారుతి సుజుకి సంస్థకు సియాజ్ సెడాన్ ఎంతో కాలం నుండి మంచి అమ్మకాలు సాధించిపెడుతోంది. ఈ మధ్య కాలంలో మిడ్ సైజ్ సెడాన్ కార్ల విక్రయాలు జోరందుకోవడం, అందుకు అనుగుణంగా పోటీగా ఉన్న మోడళ్లు హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నా సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి ప్రవేశిస్తుండటంతో, మారుతి సియాజ్ లైనప్‌లో సరికొత్త ఎస్ వేరియంట్‌ను చేర్చినట్లు తెలుస్తోంది.

    మారుతి సియాజ్ ఎస్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    బడ్జెట్ ధరలో సరసమైన ఉత్పత్తులను అందించే సంస్థగా మారుతి సుజుకి కంపెనీ పేరుగాంచింది. సెడాన్ సెగ్మెంట్లో కూడా సియాజ్ అత్యుత్తమ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లతో ఎంతో మంది కస్టమర్లకు ఉత్తమ ఎంపికగా నిలిచింది. కాబట్టి త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సియాజ్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Ciaz S Launched In India; Priced At Rs 9.39 Lakh Onward
Story first published: Thursday, August 17, 2017, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X