రూ. 5.24 లక్షల ప్రారంభ ధరతో స్విఫ్ట్ డిజైర్ టూర్ రీలాంచ్ చేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి డిజైర్ టూర్ కారును మళ్లీ విడుదల చేసింది. డిజైర్ టూర్ కారు ఇప్పుడు దేశ్యాప్తంగా అద్దె కార్ల మార్కెట్ అవసరాల కోసం అందుబాటులో ఉంచింది.
మారుతి సుజుకి తమ రెండవ తరానికి చెందిన స్విఫ్ట్ డిజైర్ టూర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ప్రారంభ ధర రూ. 5.24 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా అందుబాటులోకి తెచ్చింది. సరికొత్త స్విఫ్ట్ డిజైర్ టూర్ గురించి మరిన్ని వివరాలు...

రెండవ తరానికి చెందిన స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మారుతి వీటి మీద డిస్కౌంట్ మరియు ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్లను కూడా ప్రకటించింది.

డిజైర్ టూర్ మీద గరిష్టంగా రూ. 40,000 ల వరకు డిస్కౌంట్ కలదు, పెట్రోల్ వేరియంట్‌పై రూ. 15,000 లు డిస్కౌంట్ మరియు ఇతర డిస్కౌంట్లుగా రూ. 5,000 ల వరకు ఆఫర్ ప్రకటించింది. అదే విధంగా డీజల్ వేరియంట్ మీద రూ. 40,000 ల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.

- డిజైర్ టూర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5,24,000 లు
- డిజైర్ టూర్ డీజల్ వేరియంట్ ధర రూ. 5,99,000 లు రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

డిజైన్ మరియు ఫీచర్లు
డిజైన్ పరంగా ఇందులో మునుపున్న స్విఫ్ట్ డిజైర్ డిజైన్‌నే పోలి ఉంది. ఇందులో ప్లాస్టిక్ బంపర్ మరియు ప్లాస్టిక్ గ్రిల్ మరియు సిల్వర్ కలర్ స్టీల్ వీల్, నలుపు రంగుల్లో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, వంటివి యథావిధిగా ఇందులో కొనసాగాయి.

ఇంటీరియర్ స్విఫ్ట్ డిజైర్ టూర్‌లో డ్యూయల్ టోన్ మరియు బీజి ఫ్యాబ్రిక్ ఇంటీరియర్ అప్‌హోల్‌స్ట్రే, పవర్ విండోలు, మరియు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే వంటి ఫీచర్లు మారుతి ఇందులో అందించింది.

సాంకేతికంగా స్విఫ్ట్ డిజైర్ టూర్‌లో ఉన్న 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 155ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మరియు స్విఫ్ట్ డిజైర్ టూర్‌లో 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 స్విఫ్ట్ డిజైర్ టూర్ సెకండ్ ఎడిషన్ కాంపాక్ట్ సెడాన్ కారు మూడు విభిన్న రంగులో లభిస్తుంది. అవి, తెలుపు, సిల్వర్ మరియు బ్లాక్ కలర్.
Via IAB


Click it and Unblock the Notifications