మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్ల కోసం...

మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగం విపణిలోకి ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ కారును విడుదల చేసింది. సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ధర రూ. 2.19 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

By Anil

మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగం విపణిలోకి ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ కారును విడుదల చేసింది. సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ధర రూ. 2.19 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి స్పోర్ట్స్ కార్ లైనప్‌లో ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ కారును ఎంట్రీలెవల్ రోడ్‌స్టర్‌గా విడుదల చేసింది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

2017 మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ సాంకేతిక వివరాలు

సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారులో 4.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్ కలదు. ఇది 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 469బిహెచ్‌పి పవర్ మరియు 1,700 నుండి 5,000ఆర్‌పిఎమ్ మధ్య 630ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ట్రాన్స్‌మిషన్ మరియు స్పీడ్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గుండా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకండ్ల వ్యవధిలోనే చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 302 కిలోమీటర్లుగా ఉంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ డిజైన్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు ఫ్రంట్ డిజైన్‌ను ట్రాక్ ఫోకస్ ప్రేరణతో మెర్సిడెస్ రూపొందించింది. ఇవాళ మెర్సిడెస్ లాంచ్ చేసిన ఏఎమ్‌జి జిటి ఆర్ ను కూడా ఇదే డిజైన్ లాంగ్వేజ్‌లో డిజైన్ చేసింది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ఫ్రంట్ డిజైన్‌లో మెర్క్ లార్జ్ ప్యానమెరికా గ్రిల్ కలదు. ఇది ఇంజన్‌ కూలింగ్ వ్యవస్థ కోసం అధిక మొత్తంలో గాలిని గ్రహించే విధంగా క్లోజింగ్ మరియు ఓపెనింగ్ స్లాట్లను కలిగి ఉంది. మరియు సరికొత్త డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ కలవు.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారులో ఎలక్ట్రిక్ పవర్ సహాయంతో పనిచేసే మూడు లేయర్ల సాఫ్ట్ టాప్ రూఫ్ కలదు. కారు వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉన్నపుడు 11 సెకండ్లలో రూఫ్ ముడుచుకుంటుంది(క్లోజ్). అల్ల్యూమినియం, స్టీల్ మరియు మెగ్నీషియం సమ్మేళనంతో రూఫ్ ఫ్రేమ్ తయారు చేయబడింది. ఇది బ్లాక్, రెడ్ మరియు బీజి కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏఎమ్‌జి జిటి లైనప్‌లో మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి రోడ్‌స్టర్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ కారు. శక్తివంతమైన వి8 ఇంజన్‌తో, ఓపెన్ రూఫ్ టాప్‌తో డ్రైవింగ్ ఎంజాయ్ చేయలనుకునే ఔత్సాహికులకు ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే ధర విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mercedes AMG GT Roadster Launched In India; Priced At Rs 2.19 Crore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X