రెనో క్విడ్ కారును డిసెంబర్ లేదా జనవరిలో ఎప్పుడు కొంటే మంచిది?
రెనో క్విడ్ కారు కొనాలనుకునే చాలా మంది కస్టమర్ల తలెత్తే మొదటి ప్రశ్న ఈ డిసెంబరులో కొనడం లేదంటే, వచ్చే ఏడాది జనవరిలో ఎంచుకోవడం. ఎంతో మంది అడిగిన ఈ ప్రశ్నకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు వివరణ.
రెనో క్విడ్ కారు కొనాలనుకునే చాలా మంది కస్టమర్లలో తలెత్తే ప్రశ్న ఈ డిసెంబరులో కొనడం మంచిదా.. లేదంటే వచ్చే ఏడాది జనవరిలో ఎంచుకోవడం మంచిదా..? ఎంతో మంది అడిగిన ఈ ప్రశ్నకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు వివరణ.

రెనో ఇండియా విభాగం దేశీయంగా ఉన్న తమ క్విడ్ శ్రేణి కార్లతో అన్ని మోడళ్ల మీద జనవరి 1, 2018 నుండి ధరలు పెంచడానికి సిద్దమైంది. ఈ ధరల పెంపు నిజమే అంటూ రెనో ఇండియా అధికారిక ప్రకటన చేసింది.

ధరలు పెంపు ఖచ్చితంగా అనివార్యమైతే, జనవరి 1 నుండి అన్ని రెనో కార్ల ధరలు మూడు శాతం వరకు పెరగనున్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరగడం మరియు దిగుమతి పన్నులు పెరగడంతో ధరలు పెంచనున్నట్లు రెనో తెలిపింది.

రెనో తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్తగా విడుదలైన రెనో క్యాప్చర్ మినహా, లైనప్‌లో ఉన్న క్విడ్, డస్టర్ మరియు లాజీ వంటి మోడళ్ల ధరలు పెరగనున్నాయి. రెనో క్యాప్చర్ మాత్రం జనవరి 2018 నుండి ప్రస్తుతం ఉన్న ధరలతోనే లభ్యం కానుంది.

రెనో ఇండియా విడుదల చేసిన ప్రకటనలో, "పెరుగుతున్న పెట్టుబడి మరయు సరుకు రవాణా వ్యయాల యొక్క ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించడం కోసం ధరలు పెంపు తప్పనిసరి అయ్యిందని తెలిపింది."

ప్రస్తుతం రెనో ఇండియా తమ అన్ని మోడళ్ల మీద ఆకర్షణీయమైన డిసెంబర్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. అత్యుత్తమ ఫైనాన్స్ స్కీములను అందిస్తోంది.
రెనో ప్రత్యేక డిసెంబర్ ఆఫర్లు మరియు డిస్కౌంట్ల కోసం...

డిసెంబరులో ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించి కొత్త సంవత్సరం ప్రారంభం జనవరిలో ధరలు పెంచడానికి ఒక అవినాభావ సంభందం ఉంది. కొత్త ఏడాది చాలా మంది కస్టమర్లు పాత మోడల్ నెంబర్ కార్లను ఎంచుకోరు. కొత్త మోడల్ ఇయర్ ఉన్న కార్లకే మొగ్గు చూపుతారు. కాబట్టి 2017లో తయారైన కార్లను ఈ ఏడాది ముగిసేలోపే విక్రయించడానికి ఆఫర్లు ప్రకటిస్తారు.

పాత స్టాకును క్లియర్ చేసుకునేందుకు 2017 ఏడాదిలో ప్రకటించిన ఆఫర్ల ద్వారా నష్టపోయిన కొద్ది మొత్తాన్ని, ఆ తరువాత ఏడాది 2018 లో ధరల పెంపు ద్వారా మళ్లీ రాబడతారు. కాబట్టి, 2017 మోడల్ కార్లు తక్కువ ధరతో, 2018 మోడల్ కార్లు ఎక్కువ ధరతో లభిస్తాయి.

డబ్బు సమస్యే కాదు మోడల్ ఇయర్ ఇంపార్టెంట్ అయితే, 2018లో కొనడం బెటర్. మోడల్ ఇయర్ ఏదైనా సరే తక్కువ ధరతో ఎంచుకోవాలనుకుంటే 2017 మోడల్ కారును ఎంచుకోవచ్చు. కాబట్టి వీటి పరంగా ఏ సంవత్సరంలో కారును ఎంచుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








