TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
క్విడ్ మీద డిసెంబర్ ఆఫర్లను ప్రకటించిన రెనో ఇండియా
రెనో ఇండియా ఈ మధ్య కాలంలో క్విడ్ ఎలక్ట్రిక్ వెర్షన్ విశయమై పలుమార్లు వార్తల్లోకి ఎక్కుతోంది. క్విడ్ హ్యాచ్‌బ్యాక్ రెనో ఇండియాకు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. అందుకే క్విడ్ కారును పలు విభిన్న మోడళ్లలో లాంచ్ చేసింది.
2017 ఏడాది ముగింపు దశకు వచ్చిన సందర్భంగా రెనో ఇండియా తమ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మీద సంవత్సరాంతపు ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 31, 2017 వరకు మాత్రమే లభించనున్న ఆఫర్ల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...
రెనో క్విడ్ లోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మినహా అన్ని వేరియంట్ల మీద 10,000 రుపాయలు విలువైన ఉచిత యాక్ససరీలు మరియు ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్ క్రింది 7.99 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది.
రెనో క్లైంబర్ మినహా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 15,000 ల విలువైన ఉచిత యాక్ససరీలు మరియు ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన 7.99 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- అన్ని ఫైనాన్స్ స్కీముల మీద ఉన్న ఆఫర్లు రెనో ఫైనాన్స్ ద్వారా మాత్రం లభిస్తాయి. మరియు రెనో ఫైనాన్స్ యొక్క పూర్తి అభీష్టానం మేరకే లోన్ మంజూర్ అవుతుంది.
- రెనో 1.0లీటర్ ఆర్ఎక్స్ఎల్ ఆటోమేటిక్ మరియు ఆర్ఎక్స్‌టి ఆప్షనల్ ఆటోమేటిక్ వేరియంట్ల మీద ఉన్న ప్రీమియమ్ ప్యాక్ ఆఫర్ బదులుగా 7.99 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.
- ప్రీమియమ్ ప్యాక్ ఆఫర్ లేదా 7.99 శాతం వడ్డీ రేటు ఆఫర్లు క్విడ్ క్లైంబర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ల మీద లభించవు.
చిన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును ఎంచుకోవాలనుకుంటే మారుతి సుజుకి ఒక్కటే ఆప్షన్ కాదు. రెనో ఇండియా మంచి ఛాయిస్ విపణిలోకి ప్రవేశపెట్టింది. రెనో వారి క్విడ్ హ్యాచ్‌బ్యాక్ రెనో ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. మరెందుకు ఆలస్యం, కొత్తగా ప్రయత్నించండి... విభిన్నంగా ఉండండి.