ఉమ్మడి కుటుంబం కోసం సరికొత్త 7-సీటర్ కారును విడుదల చేయనున్న రెనో

ఇండియన్ మార్కెట్ కోసం నాలుగు కొత్త మోడళ్లను కేటాయించింది. ఇందులో ప్రతి కుటుంబం కోరుకునే ఓ సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ కూడా ఉంది.

By Anil

రెనో ఇండియా మాతృ సంస్థ గ్రూపె రెనో డ్రైవ్ ది ఫ్యూచర్ అంటూ 2017-2022 మధ్యస్థ కాల ప్రణాళికను పరిచయం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఇండియన్ మార్కెట్ కోసం నాలుగు మోడళ్లను కేటాయించింది. ఇందులో ప్రతి కుటుంబం కోరుకునే ఓ సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ వెహికల్ కూడా ఉంది.

నో 7 సీటర్ ఎమ్‌పీవీ

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో సిఎమ్ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్‌లోని అడ్వాన్స్‌డ్ వెర్షన్‌ను వినియోగిస్తోంది. ఇది వేదిక మీద క్విడ్, రెడి-గో లను అభివృద్ది చేయగా, అతి త్వరలో రానున్న నూతన ఎమ్‌పీవీ వాహనాన్ని కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్‌చేస్తోంది.

నో 7 సీటర్ ఎమ్‌పీవీ

గ్రూపె రెనో చీఫ్ కాంపిటీటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ, "రెనో ఇండియన్ మార్కెట్లోకి నూతన కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తున్నాము. ఎక్కువ మంది పెద్దలు సౌకర్యంగా కూర్చునే సదుపాయంతో నాలుగు మీటర్ల లోపు పొడవు ఉండేలా నిర్మిస్తున్నట్లు తెలిపాడు."

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
నో 7 సీటర్ ఎమ్‌పీవీ

రెనో ఇండియా ప్రస్తుతం క్విడ్ హ్యాచ్‌బ్యార్, డస్టర్ ఎస్‌యూవీ, మరియు లాజీ ఎమ్‌పీవీ లను మాత్రమే విక్రయిస్తోంది. వీటికి తోడుగా అతి త్వరలో రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ విడుదలవ్వనుంది.

నో 7 సీటర్ ఎమ్‌పీవీ

రెనో లాజీ ఆశించిన మేర ఫలితాలను సాధించేందుకు తీవ్ర ఇబ్బందిపడుతోంది. రెనో లైనప్‌లో లభించే వెహికల్స్ సంఖ్యను నాలుగు పెంచే క్యాప్చర్ భారీ అంచనాలతో వస్తోంది.

నో 7 సీటర్ ఎమ్‌పీవీ

ఏడాదికొకటి చొప్పున విడుదల చేయాలనే రెనో ప్రణాళిల్లో మొదటి వెహికల్ క్యాప్చర్ కాగా, రెండవది సరికొత్త ఎమ్‌పీవీ. వీటి అనంతరం, కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు క్విడ్ ఎలక్ట్రిక్ కార్లు వరుసగా విడుదలకు సిద్దం కానున్నాయి.

Trending On TeluguDriveSpark:

భారీ దీపావళి డిస్కౌంట్లతో ముందుకొచ్చిన పది ఎస్‌యూవీలు: గరిష్టంగా 8 లక్షల వరకు తగ్గింపు

నో 7 సీటర్ ఎమ్‌పీవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మారుతి సుజుకి ఎర్టిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో భారత్‌లోకి నాలుగు మీటర్లు పొడవులోపున్న కాంపాక్ట్ ఎమ్‌పీవీని ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో పోటీదారులకు గట్టి పోటీగా రెనో విడుదలకు సిద్దం చేస్తోంది.

ప్రస్తుతం రెనో వద్ద ఉన్న లాజీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఎలాగైనా ఈ సారి ఎమ్‌పీవీతో మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి సిద్దమవుతోంది. అయితే, ఇది పూర్తిగా మార్కెట్లోకి విడుదలైతేగానీ చెప్పలేము...

More from DriveSpark

Article Published On: Wednesday, October 18, 2017, 13:21 [IST]
English summary
Read In Telugu: Renault Teases New Compact MPV For India
Read more on: #renault #రెనో
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+