భారీగా పెరిగిన టయోటా కార్ల ధరలు...
టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ ఇన్నోవా, ఫార్చ్యూనర్, కరోలా మరియు ఎటియోస్ ప్యాసింజర్ కార్ల మీద ధరలు పెరిగినట్లు ప్రకటించింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ ఇన్నోవా, ఫార్చ్యూనర్, కరోలా మరియు ఎటియోస్ ప్యాసింజర్ కార్ల మీద ధరలు పెరిగినట్లు ప్రకటించింది. ధరలు పెరిగిన అనంతరం కొత్త ధరలు సెప్టెంబర్ 12, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు టయోటా తెలిపింది.

జిఎస్‌టి మండలి ప్యాసింజర్ కార్ల మీద తాజాగా జరిపిన సవరణల్లో కొన్ని వాహనాల మీద 2 నుండి 7 శాతం వరకు జిఎస్‌టి సెస్ పెరిగింది. ఈ కెటగిరీల క్రిందకు వచ్చే కార్ల మీద చెల్లించాల్సిన జిఎస్‌టిని పునఃసమీక్షించి తమ ఉత్పత్తుల మీద ధరలు పెంచినట్లు టయోటా మోటార్స్ తెలిపింది.

టయోటా లైనప్‌లో ఉన్న కార్ల మీద ధరల పెంపు ఇలా ఉంది.
- ఇన్నోవా క్రిస్టా - రూ. 78,000 లు
- ఫార్చ్యూనర్ - 1,60,000 లు
- కరోలా ఆల్టిస్ - 72,000 లు
- ప్లాటినమ్ ఎటియోస్ - రూ. 13,000 లు అన్ని ధరలు కూడా ఢిల్లీ ఆధారంగా లెక్కించబడ్డాయి. వివిధ రాష్ట్రాల ఆధారంగా ధరల పెంపులో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
Recommended Video


టయోటా మోటార్స్ తమ లైనప్‌లో ఉన్న చిన్న కార్ల మీద ధరలు పెంచలేదు. ఎటియోస్ లివా, ఎటియోస్ క్రాస్ మరియు హైబ్రిడ్ కార్ల మీద ధరలు పెరగలేదు.

టయోటా కిర్లోస్కర్ ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగపు డైరక్టర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజా మాట్లాడుతూ, " కొన్ని సెగ్మెంట్లలోనే ప్యాసింజర్ కార్ల మీద జిఎస్‌టి సవరణ కోసం తీసుకున్న నిర్ణయం ఆమోదం పొందడంతో ధరలను తప్పనిసరిగా పెంచాల్సి వచ్చిందని తెలిపాడు."

ప్రస్తుతం టయోటా ఇండియా లైనప్‌లో, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, కరోలా ఆల్టిస్, ఎటియోస్, ఎటియోస్ లివా, ఎటియోస్ క్రాస్, క్యామ్రీ హైబ్రిడ్ కార్లను కర్ణాటకలోని బిడది ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. మరియు టయోటా ప్రాడో, ల్యాండ్ క్రూయిజర్ మరియు ప్రియస్ కార్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








