ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి: ఏయే కార్ల మీద ఎంత GST వివరంగా...

Written By:

కేంద్రం దేశీయంగా ఉన్న అన్ని రకాల ప్యాసింజర్ కార్ల మీద వస్తు మరియు సేవల పన్ను(GST)ని సవరించింది. దీంతో మునుపటి జిఎస్‌టి స్థానంలోకి తాజాగా సవరించిన కొత్త జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. ప్యాసింజర్ కార్లను మూడు భాగాలుగా విభజించి, వాటికి విభిన్న స్లాబుల్లో ట్యాక్స్ నిర్ణయించారు.

ఎలాంటి వాహనాల మీద ఎంత వరకు ట్యాక్స్ విధించారో చూద్దాం రండి....

ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

తొలిసారిగా జిఎస్‌టి అమలు చేయడంతో ప్యాసింజర్ కార్ల కంపెనీలకు మరియు కస్టమర్లకు చాలా వరకు కలిసొచ్చింది. అయితే జిఎస్‍‌టి పరంగా ట్యాక్స్ కేటాయించడంలో అర్థవంతం కాని అసమానతలు ఉండటంతో జిఎస్‌టి మండళి మళ్లీ పునఃసమీక్ష నిర్వహించి జిఎస్‌టిలో మార్పులు చేర్పులు చేసింది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

చిన్న కార్ల మీద సవరించబడిన జిఎస్‌టి ఎలాంటి ప్రభావం పడలేదు. 12,00సీసీ వరకు ఉన్న పెట్రోల్ మరియు 1500సీసీ కెపాసిటి వరకు ఉన్న డీజల్ కార్ల మీద గతంలో ఉన్న 28 శాతం జిఎస్‌టి మరియు 15 శాతం సెస్ కలుపుకొని మొత్తం 43 శాతం ట్యాక్సులో ఎలాంటి మార్పులు చేయకుండా యథావిధిగా ఉంచారు.

ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

మిడ్-సైజ్ కార్లు, లగ్జరీకార్లు(ఎస్‌యూవీలు మినహా...) మరియు ఎస్‌యూవీలుగా విభజించి కొత్త జిఎస్‍‌టి ట్యాక్స్ నిర్ణయించారు. సవరించిన జిఎస్‌టి ట్యాక్స్ ప్రకారం, మిడ్ సైజ్ కార్ల మీద 28 శాతం గరిష్ట నిర్ధిష్ట జిఎస్‌టి ట్యాక్స్ మరియు 17 శాతం సెస్ కలుపుకొని మొత్తం 45 శాతం ట్యాక్స్ నిర్ణయించారు.

ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

ఎస్‌యూవీలు కాకుండా కేవలం లగ్జరీ కార్ల మీద ట్యాక్స్:

లగ్జరీ కార్ల మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్‌ మరియు 20 శాతం సెస్ కలుపుకొని మొత్తం 48 శాతం ట్యాక్స్ నిర్ణయించారు.

కేవలం ఎస్‌యూవీల మీద ట్యాక్స్:

ప్యాసింజర్ కార్లలోని కేవలం ఎస్‌యూవీల మాత్రమే 28 శాతం నిర్దిష్ట ట్యాక్స్ మరియు 22 శాతం సెస్ కలుపుకొని 50 శాతం ట్యాక్స్ విధించారు.

ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

పాత మరియు కొత్త జిఎస్‌టి రేట్ల వివరాలు...

బాడీ స్టైల్ పాత GST రేటు కొత్త GST రేటు
సబ్ 4-మీటర్ వెహికల్స్

(1200సీసీ లోపున్న పెట్రోల్ ఇంజన్)

28% జిస్‌టి+1% సెస్=29% 28% జిస్‌టి+1% సెస్=29%
సబ్ 4-మీటర్ వెహికల్స్

(1200సీసీ లోపున్న డీజల్ ఇంజన్)

28% జిస్‌టి+3% సెస్=31% 28% జిస్‌టి+3% సెస్=31%
సబ్ 4-మీటర్ వెహికల్స్

(1200cc/1500cc

కంటే ఎక్కవ కెపాసిటి ఇంజన్)

28% జిస్‌టి+15% సెస్=43% 28% జిస్‌టి+15% సెస్=43%
ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

మిడ్ సైజ్ కార్లు

(4-మీటర్ల ఎక్కువ పొడవున్నవి)

28% జిస్‌టి+15% సెస్=43% 28% జిస్‌టి+17% సెస్=45%
లగ్జరీ కార్లు

(4-మీటర్ల ఎక్కువ పొడవున్నవి)

28% జిస్‌టి+15% సెస్=43% 28% జిస్‌టి+20% సెస్=48%
ఎస్‌యూవీలు

(4-మీటర్ల ఎక్కువ పొడవున్నవి)

28% జిస్‌టి+15% సెస్=43% 28% జిస్‌టి+22% సెస్=50%
హైబ్రిడ్ వాహనాలు 28% జిస్‌టి+15% సెస్=43% 28% జిస్‌టి+15% సెస్=43%
ఎలక్ట్రిక్ వాహనాలు 12% జిఎస్‌టి(సెస్ లేదు) 12% జిఎస్‌టి(సెస్ లేదు)
ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ కార్లు ఇదే తరహా జిఎస్‌టి రేట్లు అమలవుతాయి. తాజాగా సవరించిన జిఎస్‌టిలో మిడ్ సైజ్ కార్ల మీద 2% సెస్, లగ్జరీ కార్ల మీద 5% సెస్ మరియు ఎస్‌యూవీ వాహనాల మీద 7% పెరిగింది. కొత్తగా అమలైన జిఎస్‌టి రేట్లు సెప్టెంబర్ 11, 2017 నుండి అమల్లోకి వచ్చాయి.

ప్యాసింజర్ కార్ల మీద సవరించిన జిఎస్‌టి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జిఎస్‌టి అమలు కావడానికి ముందున్న ట్యాక్స్ రేట్లను పరిశీలిస్తే, ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ రేట్లు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. జిఎస్‌టికి ముందు మిడ్ సైజ్ కార్ల మీద ట్యాక్స్ 46.60 శాతం ఉండగా, ఇప్పుడు 45 శాతం ఉంది. లగ్జరీ కార్ల మీద మునుపు 55.30 శాతం ట్యాక్స్ అమలవుతుండగా, ఇప్పుడు 50 శాతం అమల్లోకి వచ్చింది. తగ్గింది కొంచమే అయినా, మునుపటి ట్యాక్స్ విధానంతో పోల్చుకుంటే ఈ విధానంలో పారదర్శకత చాలా స్పష్టంగా ఉంది.

English summary
Read In Telugu: GST Revision: Three Cess Slabs For Mid-Sized, Luxury Cars, And SUVs

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark