2018 మారుతి స్విఫ్ట్ ధరలు వచ్చేశాయ్!!

Written By:

మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేయడానికి పనులు వేగవంతం చేస్తోంది. కంపెనీ ఇప్పటికే, తమ పాత తరం స్విఫ్ట్(సెకండ్ జనరేషన్) కారు ప్రొడక్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది.

మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ ఆర్ఎస్ కల్సి బిజినెస్ లైన్‌తో మాట్లాడతూ మారుతి అతి త్వరలో విడుదల చేయనున్న సరికొత్త 2018 గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

2018లో విడుదలవుతున్న కార్లలో మారుతి స్విఫ్ట్ అతి ముఖ్యమైన విడుదలవుతుందని తెలిపారు. మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ కంటే రూ. 10,000 లు అధికంగా ఉండనుంది.

Recommended Video - Watch Now!
Fighter Jet Crash In Goa - DriveSpark
2018 మారుతి స్విఫ్ట్ ధరలు

అదే విధంగా 2018 మారుతి స్విఫ్ట్ టాప్ రేంజ్ జడ్‌డిఐ డీజల్ వేరియంట్ ధర అంచనాగా రూ. 7.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండనుంది. రిపోర్ట్స్ ప్రకారం, పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ మినహాయిస్తే సిఎన్‌జి లేదా ఎల్‌పిజి ఇంధన వేరియంట్లలో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు మారుతి గత ఏడాది విడుదల చేసిన న్యూ డిజైర్ కార్ల కంటే క్రింద స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ మూడవ తరానికి చెందిన సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ విపణిలో ఉన్న గ్రాండ్ ఐ10 మరియు ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల నోర్లు మూయించనుంది.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

కొత్త తరం స్విఫ్ట్ చూడటానికి అచ్చం మార్కెట్ నుండి వెళ్లిపోయిన సెకండ్ జనరేషన్ స్విఫ్ట్‌నే పోలి ఉన్నప్పటికీ, ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ఎన్నో ఆకర్షణీయమైన మార్పులు జరిగాయి. దీనికి తోడు విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో వస్తున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

కంపెనీ యొక్క హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా 2018 మారుతి స్విఫ్ట్ అభివృద్ది చేయబడింది. మారుతి సుజుకి ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద బాలెనో మరియు న్యూ డిజైర్ కార్లను డెవలప్ చేసింది. హార్టెక్ ఫ్లాట్‌ఫామ్‌లో అభివృద్ది చేసిన ఈ కార్లలో ఎక్కువ తన్యత స్టీల్ వాడటంతో తేలికపాటి బరువు మరియు అధిక ధృడత్వం సాధ్యమయ్యింది. పాత కార్లలో ఉన్న ఛాసిస్‌తో పోల్చుకుంటే ఇందులో అత్యంత ధృడమైన ఛాసిస్ కలదు.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 82బిహెచ్‌పి పవర్ మరియు 112ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌, అదే విధంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌‌తో లభ్యం కానుంది. తేలిక పాటి బరువుతో నిర్మించడంతో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వనున్నాయి.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బుల్లెట్ బైకు: ఇక మీదట ఆ సౌండ్ లేనట్లేనా..?

రోజురోజుకూ ముదురుతున్న యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం

స్పేర్ వీల్‌ను స్టెప్నీ అని ఎందుకు అంటారో తెలుసా?

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తప్పనిసరిగా వస్తోంది. అయితే, ఆటో గేర్‌ షిఫ్ట్(AGS)ను కూడా ఆప్షనల్‌గా అందించే ఛాన్స్ ఉంది. భద్రత పరంగా స్విఫ్ట్ లోని అన్ని వేరియంట్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా లభించనున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఏడాదిలో మారుతి సుజుకి చేస్తున్న అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన విడుదల 2018 మారుతి స్విఫ్ట్. డిజైన్, ఇంటీరియర్ మరియు ఫీచర్ల పరంగా విపణిలోకి వచ్చిన అచ్చం న్యూ డిజైర్‌ పోలికలతో వస్తున్న కొత్త తరం స్విఫ్ట్ మారుతికి అతి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టనుంది.

2018 మారుతి స్విఫ్ట్ ధరలు

అవే మునుపటి ఇంజన్‌లతో వస్తున్నప్పటికీ, ఇంత వరకు కస్టమర్లకు పరిచయం చేయని ఎన్నో ఫీచర్లను స్విప్ట్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ఆవిష్కరించి తరువాత పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి....

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Maruti Swift Price Details Revealed — Launch Soon

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark