భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ లగ్జరీ ఎస్‌యూవీ: జీప్ కంపాస్

Written By:

అమెరికా లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన కంపాస్‌తో భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన కేవలం ఏడు నెలల వ్యవధిలోనే ఏకంగా 25,000 కంపాస్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేసింది.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
జీప్ కంపాస్

ఎగుమతుల విషయానికి వస్తే, ఆస్ట్రేలియా, జపాన్ మరియు ఇంగ్లాండ్ వంటి దేశాలకు సుమారుగా 5,000 యూనిట్లకు పైగా ఎగుమతి చేసింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న దేశాలకు కుడి చేతి వైపు స్టీరింగ్ వీల్ ఉన్న కంపాస్ ఎస్‍‌యూవీలను తయారు చేసి, ఎగుమతి చేసే హబ్‌గా భారత్‌ నిలిచింది.

జీప్ కంపాస్

జీప్ కంపాస్ ఎస్‌యూవీల శ్రేణి 1.4-లీటర్ మల్టీ-ఎయిర్ టుర్బో పెట్రోల్ స్పోర్ట్ 4X2 వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ రూ. 15.18 లక్షల మరియు 2.0-లీటర్ మల్టీజెట్ టుర్బో డీజల్ లిమిటెడ్(ఒ) 4X4 వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ. 21.94 లక్షల మధ్య ఉంది.

జీప్ కంపాస్

స్పోర్ట్, లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ట్రిమ్‌లలో 10 విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. 4X2 టుర్బో పెట్రోల్ వేరియంట్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యమవుతోంది. అతి త్వరలో కంపాస్ టాప్ ఎండ్ వేరియంట్ కంపాస్ ట్రయల్‌హాక్‌ను కూడా విడుదల చేయనుంది. ఇప్పటికే దీనిని పలుమార్లు పరీక్షించింది.

జీప్ కంపాస్

కంపాస్‌లోని 2.0-లీటర్ కెపాసిటి గల మల్టీ జెట్ టుర్బో డీజల్ ఇంజన్ 173బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 1.4-లీటర్ మల్టీ ఎయిర్ టుర్బో పెట్రోల్ ఇంజన్ 162బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జీప్ కంపాస్

కంపాస్‌లోని స్పోర్ట్ మరియు లాంగిట్యూడ్ వేరియంట్లు టు-వీల్ డ్రైవ్(4X2) సిస్టమ్‌లో లభిస్తుండగా, టాప్ ఎండ్ వేరియంట్ లిమిటెడ్‌లో 4X2 మరియు 4X4 డ్రైవ్ సిస్టమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆటో, మడ్, శాండ్ మరియు స్నో వంటి టైర్రైన్ కోసం టెర్రైన్ ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలదు.

జీప్ కంపాస్

ప్రస్తుతం, రంజన్‌గావ్‌లో ఉన్న ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ప్లాంటులో కంపాస్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తోంది. కంపాస్ మీద వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి వారానికి ఆరు రోజులు, రోజుకు రెండు షిఫ్టుల్లో నిరంతరం ప్రొడక్షన్ చేస్తున్నారు.

జీప్ కంపాస్

జీప్ కంపాస్ ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించడంతో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ తమ డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరించింది. జీప్ ఉత్పత్తుల్లో తలెత్తే సాంకేతిక సమస్యలు పరిష్కరించడానికి శిక్షణ పూర్తి చేసుకున్న మోపార్ బ్రాండ్ టెక్నీషియన్స్ జీప్ అధీకృత వర్క్‌షాపుల్లో పనిచేస్తున్నారు.

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep compass production crosses 25000 units
Story first published: Wednesday, March 7, 2018, 10:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark