త్వరలో ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ విడుదల చేయనున్న మహీంద్రా

భారతదేశపు విభిన్న వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ కారును అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం, ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మహీంద్రా మరియు టాటా మోటార్స్ మా

By Anil Kumar

భారతదేశపు విభిన్న వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ కారును అభివృద్ది చేస్తోంది. దీనికి సంభందించిన మరిన్ని వివరాలు వెల్లడయయ్యాయి. ప్రస్తుతం, ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మహీంద్రా మరియు టాటా మోటార్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

ఇటీవల మహీంద్రా మరియు ఫోర్డ్ మోటార్స్ పరస్పర భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో టాటాకు గట్టి పోటీనిచ్చేలా ఫోర్డ్ ఆస్పైర్ సెడాన్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి మహీంద్రా సిద్దమైంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

టాటా పూర్తి స్థాయిలో టిగోర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును అభిృద్ది చేసింది. అనుమతులు పొందిన ఈ మోడల్‌ను ప్రభుత్వ దిగ్గజ సంస్థ ఇఇఎస్ఎల్ కూడా సరఫరా చేస్తోంది. అయితే, ఇంకా విక్రయాలకు అందుబాటులోకి రాలేదు. కానీ త్వరలో విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

ఈ నేపథ్యంలో ఎలాగైనా టాటా మీద రాణించేందుకు ప్రయత్నిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం ఎలక్ట్రిఫికేషన్ మరియు టెక్నాలజీ పరంగా ఫోర్డ్‌తో చేతులు కలిపింది. ఇరు సంస్థల భాగస్వామ్యంలో ఫోర్డ్ వారి బి562 ఫ్లాట్‌ఫామ్ మీద సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

ఫోర్డ్ ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ఆధారిత ఎలక్ట్రిక్ సెడాన్ కారు అభివృద్ది, తయారీ మరియు విడుదలతో సహా ఇతర వివరాలను మహీంద్రా-ఫోర్డ్ భాగస్వామ్యం అతి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. టాటా మరియు మహీంద్రా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశించకుండానే రెండింటి మధ్య పోటీ తీవ్రమవుతోంది.

Recommended Video

Auto Expo 2018: Mahindra KUV100 Electric Launch Details, Specifications, Features - DriveSpark
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

ప్రస్తుతం, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ మరియు టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. ఫోర్డ్ వద్ద ఎలక్ట్రిక్ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ కోసం కావాల్సిన వసతులన్నీ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మహీంద్రా అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

అంతే కాకుండా, మహీంద్రా వద్ద ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ద్వారా ఫోర్డ్ కూడా లాభపడనుంది. ప్రస్తుతానికి, మహీంద్రా ఇవెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ కారును ప్రభుత్వ రంగ సంస్థ ఇఇఎస్ఎల్(EESL) కు సరఫరా చేస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా-రెనో భాగస్వామ్యంలో అభివృద్ది చేసిన లోగాన్ సెడాన్ ఆధారంగా ఇవెరిటో సెడాన్ కారును డెవలప్ చేసింది. గత కొన్నేళ్ల నుండి లోగాన్ మరియు వెరిటో సెడాన్ కార్లు విపణిలో ఉన్నాయి. కానీ, ఫ్రెష్‌ లుక్‌లో రానున్న ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఖచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకోనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా లైనప్‌లో ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ అతి ముఖ్యమైన మోడల్‌గా నిలవనుంది. అంతే కాకుండా, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ సెడాన్ కూడా ఇదే కానుంది. మహీంద్రా మరియు ఫోర్డ్ సంయుక్తంగా ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసినప్పటికీ, తమకు నచ్చిన విధంగా రెండు కంపెనీలు కూడా అవే కార్లను విభిన్న పేర్లతో విక్రయించనున్నాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మారుతి సుజుకి మరియు టయోటా మోటార్స్ మధ్య కూడా అచ్చం ఇలాంటి ఒప్పందమే కుదిరింది. ఈ రెండు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం లిథియం-అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నాయి. అంతే కాకుండా, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి టయోటా ఎలక్ట్రిక్ వెహికల్ పరిజ్ఞానాన్ని మారుతి సుజుకి ఇండియాకు అందివ్వనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం, ఇండియన్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరంభ సంస్థ మాత్రమే. తాజాగా, ఫోర్డ్ సంస్థతో చేతులు కలపడంతో మహీంద్రా ఎలక్ట్రిక్ దిగ్గజ సంస్థగా రాణించడం ఖచ్చితం. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మోస్ట్ అట్రాక్టివ్ మోడల్ ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ కూడా కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇవెరిటో మరియు టాటా టిగోర్ కార్లతో పోల్చుకుంటే ఆస్పైర్ ఎలక్ట్రిక్ అత్యంత అడ్వాన్స్‌డ్

సెడాన్ అని చెప్పవచ్చు.

Source: Economic Times

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Developing New Electric Compact Sedan — More Details Revealed
Story first published: Wednesday, March 21, 2018, 12:36 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X