వ్యాపార అవసరాల కోసం మహీంద్రా కెయువి100 ట్రిప్ ఎడిషన్

మహీంద్రా అండ్ మహీంద్రా సెగ్మెంట్ ఫస్ట్ మైక్రో ఎస్‌యూవీ కెయువి100 కాంపాక్ట్ వెర్షన్ ఎస్‌యూవీని తాజాగా కెయువి100 ట్రిప్ అనే పేరుతో లాంచ్ చేసింది.

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మరియు విభిన్న వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సెగ్మెంట్ ఫస్ట్ మైక్రో ఎస్‌యూవీ కెయువి100 కాంపాక్ట్ వెర్షన్ ఎస్‌యూవీని తాజాగా కెయువి100 ట్రిప్ అనే పేరుతో లాంచ్ చేసింది.

Recommended Video

Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
మహీంద్రా కెయువి100 ట్రిప్

అద్దె కార్లు మరియు వ్యాపార అవసరాలకు అనుగుణంగా ట్రిప్ వెర్షన్‌లో కెయువి100 మైక్రో ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల ఇంధనంతో నడిచే (పెట్రోల్ మరియు సిఎన్‌జి) మరియు డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లలో ఇది లభిస్తోంది.

మహీంద్రా కెయువి100 సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 5.16 లక్షలు మరియు డీజల్ వెర్షన్ ధర రూ. 5.42 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ట్రిప్

తక్కువ నిర్వహణ వ్యయం మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉండేలా కెయువి100 ట్రిప్ వేరియంట్‌ను అభివృద్ది చేసినట్లు మహీంద్రా వెల్లడించింది. మహీంద్రా కెయువి100 ట్రిప్ స్టాండర్డ్ వేరియంట్లో ఆరు మంది వరకు ప్రయాణించవచ్చు. ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ మధ్యలో ఉన్న సీటును మడిపేసి ఆర్మ్ రెస్ట్ తరహాలో కూడా ఉపయోగించుకోవచ్చు.

మహీంద్రా కెయువి100 ట్రిప్

మహీంద్రా అండ్ మహీంద్రా కెయువి100 ఎస్‌యూవీలో బై-ఫ్యూయల్(పలు రకాల ఇంధనం) ఇంజన్ అందించింది. ఇందులో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ సిఎన్‌జి ఇంధనంతో కూడా నడుస్తుంది. పెట్రోల్ వెర్షన్ 82బిహెచ్‌పి పవర్ మరియు సిఎన్‌జి వెర్షన్ 70బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్‌జి లేదా బై-ఫ్యూయల్ వేరియంట్లో 60లీటర్ల కెపాసిటి గల సిఎన్‌జడి ట్యాంకును ఎస్‌యూవీ డిక్కీ ప్రదేశంలో అందివ్వడం జరిగింది.

మహీంద్రా కెయువి100 ట్రిప్

మహీంద్రా కెయువి100 ట్రిప్ వేరియంట్లోని 1.2-లీటర్ డీజల్ ఇంజన్ 72బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నూతన వేరియంట్లో ఎయిర్-కండీషనింగ్, అంతర్గతంగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు పవర్ స్టీరింగ్‌తో పాటు, వాణిజ్య వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ తప్పనిసరి చేసిన ప్రభుత్వ నియమానికి అనుగుణంగా ఇందులో ఏబిఎస్ కూడా అందివ్వడం జరిగింది.

మహీంద్రా కెయువి100 ట్రిప్

మహీంద్రా కెయువి100 ట్రిప్ వేరియంట్ విడుదల సందర్భంగా మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాధిపతి విజయ్ రామ్ నక్రా మాట్లాడుతూ, "ఆరు లేదా ఐదు మంది ప్రయాణించే సీటింగ్ ఆప్షన్, విశాలమైన క్యాబిన్, అతి తక్కువ నిర్వహణ భారం, ఆకర్షణీయ ధర మరియు ఎక్కువ సంపాదించే సామర్థ్యం వంటి అంశాల పరంగా అద్దె కార్లు మరియు ట్యాక్సీ నిర్వహణకు మహీంద్రా కెయువి100 ట్రిప్ వేరియంట్ అత్యుత్తమమైన ఎంపిక అని చెప్పుకొచ్చారు."

మహీంద్రా కెయువి100 ట్రిప్

అంతే కాకుండా సరికొత్త మహీంద్రా కెయువి100 ట్రిప్ వేరియంట్ కొనుగోలు మీద ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్, యాక్ససరీ ప్యాకేజి మరియు ఐదేళ్ల వరకు పొడగించబడిన వారంటీ ప్రయోజనాలను ప్రకటించింది. కెయువి100 ట్రిప్ వేరియంట్ డైమండ్ వైట్ మరియు డాజ్లింగ్ సిల్వర్ రంగుల్లో లభ్యమవుతోంది.

మహీంద్రా కెయువి100 ట్రిప్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్యాక్సీ మరియు అద్దె కార్ల నిర్వహణ సంస్థల మరియు వాటి అనుబంధ సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఫ్లెక్సిబుల్ సీటింగ్ సామర్థ్యంతో కెయువి100 మైక్రో ఎస్‌యూవీని ట్రిప్ వేరియంట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్ మరియు డీజల్‌‌తో పాటు సిఎన్‌జి ఇంధనంతో కూడా నడిచే అవకాశం ఉండటంతో యెల్లో బోర్డ్ పాసింజర్ ట్యాక్సీలకు కెయువి100 బెస్ట్ ఛాయిస్‌ కానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra KUV100 Trip Launched In India; Prices Start At Rs 5.16 Lakh
Story first published: Friday, March 16, 2018, 15:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X