మార్కెట్లోకి మహీంద్రా మరాజొ: ప్రతి ఇండియన్ ఫ్యామిలీ దాసోహమవ్వాల్సిందే!!

మహీంద్రా విపణిలోకి నేడు సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేసింది. మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ప్రారంభ ధర రూ. 9.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి నేడు సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేసింది. మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ప్రారంభ ధర రూ. 9.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

ఎట్టకేలకు దేశీయ ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి ప్రవేశించిన మహీంద్రా తమ మరాజొ ఎమ్‌పీవీని షార్క్ చేప ప్రేరణతో డిజైన్ చేశారు. అత్యంత సరసమైన ధరలో విలాసవంతమైన ఫీచర్లతో విడుదలైన మహీంద్రా మరాజొ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం...

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ వేరియంట్లు

మహీంద్రా అండ్ మహీంద్రా తమ మరాజొ ఎమ్‌పీవీని నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి, ఎమ్2, ఎమ్4, ఎమ్6 మరియు ఎమ్8. అయితే, ఈ అన్ని వేరియంట్లు కూడా కేవలం డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతున్నాయి.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ ధరలు

మరాజొ ఎమ్‌పీవీ ధర రూ. 9.9 లక్షలతో మొదలుకొని గరిష్టంగా రూ. 13.90 లక్షలు వరకు ఉంది. క్రింద పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఇవ్వడం జరిగింది.

Variant

Price

M2

Rs 9,99,000

M4

Rs 10,95,000

M6

Rs 12,40,000

M8

Rs 13,90,000

Recommended Video

Mahindra Marazzo Launch Details: Price, Specifications & Features — DriveSpark
మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ డిజైన్

ప్రారంభంలో చెప్పినట్లుగా మహీంద్రా బృందం ఈ మరాజొ ఎమ్‌‌పీవీని షార్క్ చేప ఆధారంగా రూపొందించారు. కాస్త అటు ఇటుగా దీని రూపం షార్క్ చేపనే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ షార్క్ చేప పళ్ల మాదిరిగానే ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో ఉండే బంపర్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మరాజొ ఎమ్‌పీవీ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 17-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్. వెనుక వైపున పదునైన ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎత్తులో ఉన్నటువంటి స్టాప్ ల్యాంప్ మరియు స్పోర్టివ్ బంపర్ ఉన్నాయి.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

మహీంద్రా మరాజొ ఇంటీయర్‌లో డ్యూయల్-టోన్ థీమ్ ఫినిషింగ్ కలదు. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల డ్యాష్ బోర్డు మరియు సీట్లు, డోర్ ట్రిమ్స్ మరియు అప్‌హోల్‌స్ట్రే లేత గోధుమ రంగులో ఉన్నాయి.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ ఫీచర్లు

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో అత్యంత కీలకమైన 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఈ సెగ్మెంట్లోనే మొట్టమొదటిసారిగా సరౌండ్ కూలింగ్ టెక్నాలజీ గల రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, ఎమ్ఐడి యూనిట్ గల డ్యూయల్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సరికొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ రూపొందించిన హ్యాండ్ బ్రేక్ లీవర్ వంటి విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ 7 మరియు 8 సీటింగ్ లేఔట్లో లభ్యమవుతోంది. 7-సీటర్ వేరియంట్లోని మధ్య వరుసలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే క్యాప్టెన్ సీట్లు ఉన్నాయి మరియు 8-సీటర్ వేరియంట్లో మధ్య వరుసలో ముగ్గురు ప్రయాణించే సౌలభ్యం ఉంది. క్యాబిన్‌ లోపల నలుమూలకు ఏసి అందేలా ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి సరౌండ్ కూలింగ్ సిస్టమ్ వచ్చింది.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

భద్రత పరంగా మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎమ్‌పీవీ సెగ్మెంట్లో మొదటిసారిగా అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్లు ఉన్నాయి. మరాజొ ఎమ్6 మరియు ఎమ్8 టాప్ ఎండ్ వేరియంట్లలో అదనంగా రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ ఇంజన్ వివరాలు

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 120బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మహీంద్రా మరాజొ మైలేజ్

మహీంద్రా మరాజొ డీజల్ లీటరుకు 17.6 కిలోమీటర్లు ఇస్తుంది. మహీంద్రా త్వరలో మరాజొ ఎమ్‌పీవీని పెట్రోల్ వేరియంట్లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, భారత్‌లో అధికారికంగా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు అమలయ్యేనాటికి పెట్రోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

మరాజొ లభించే రంగులు

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ మొత్తం ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. మెరైనర్ మెరూన్, షిమ్రింగ్ సిల్వర్, అక్వా మెరైన్, ఓషియేనిక్ బ్లాక్, పోసిడన్ పర్పులు మరియు ఐస్‌బర్గ్ వైట్.

మహీంద్రా మరాజొ విడుదల వివరాలు

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా సుధీర్ఘ పరీక్షల అనంతరం ఎట్టకేలకు తమ మరాజొ ఎమ్‌పీవీని మార్కెట్లోకి అత్యంత సరసమైన ధరతో ప్రవేశపెట్టింది. డిజైన్, బాడీ, ఛాసిస్ మరియు ఇంటీరియర్ అన్నింటినీ పూర్తిగా ఒక కొత్త ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేశారు. అధునాతన ఫీచర్లతో విడుదలైన మహీంద్రా మరాజొ విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా, టాటా హెక్సా మరియు అతి త్వరలో విడుదల కానున్న మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. మరి ఇది ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి....

More from DriveSpark

Article Published On: Monday, September 3, 2018, 14:19 [IST]
English summary
Read In Telugu: Mahindra Marazzo Launched In India; Prices Start At Rs 9.9 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+