విలాసవంతమైన ఇంటీరియర్‌తో మహీంద్రా మరాజొ: ఫోటోలు

మహీంద్రా ఇటీవల మరాజొ పేరుతో సరికొత్త ఎమ్‍‌పీవీని ఆవిష్కరించింది. అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మరాజొ ఎమ్‌పీవీకి సంభందించిన ఒక్కో ఫోటోను రివీల్ చేస్తూ, వాటిలో ఉన్న ఫీచర్లతో కస్టమర్ల మతిపోగోడుతోంద

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మరాజొ పేరుతో సరికొత్త ఎమ్‍‌పీవీని ఆవిష్కరించింది. అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మరాజొ ఎమ్‌పీవీకి సంభందించిన ఒక్కో ఫోటోను రివీల్ చేస్తూ, వాటిలో ఉన్న ఫీచర్లతో కస్టమర్ల మతిపోగోడుతోంది.

తాజాగా, మహీంద్రా మరాజొ ఇంటీరియర్ పూర్తిగా రివీల్ అయ్యింది. మరాజొ ఇంటీరియర్‌లో ఉన్న ఫీచర్ల మీద ఓ లుక్కేసుకుందాం రండి...

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

తాజాగా విడుదలైన మహీంద్రా మరాజొ ఇంటీరియర్ ఫోటోలను పరిశీలిస్తే, ఇది 7 మరియు 8 సీటింగ్ లేఔట్లో లభిస్తుందనే విషయం స్పష్టమైంది. 7-సీటర్ వెర్షన్ ముందు రెండు వరుసలలో పైలట్ (వ్యక్తిగత) సీట్లను కలిగి ఉండగా, 8-సీటర్ వెర్షన్‌లోని రెండవ వరుసలో ముగ్గురు ప్రయాణించే వీలున్న బెంచ్ తరహా సీటు కలదు.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

మహీంద్రా మరాజొ లైట్ బీజీ కలర్ ఇంటీరియర్ థీమ్‌లో ఉంది. మరాజొ టాప్ ఎండ్ వేరియంట్లో లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే ఫినిషింగ్ కలదు. మొత్తంమ్మీద క్యాబిన్ చూడటానికి చాలా విలాసవంతంగా ఉంది. డోర్ల మీదున్న నలుపు రంగు హంగులు, బీజీ రంగు సీట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే, చివర వరుస సీటింగ్ స్పేస్ చాలా తక్కువగా ఉంది.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లోని డ్యాష్‌బోర్డ్‌ను బ్లాక్ కలర్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. క్రోమ్ ఫినిషింగ్‌లో ఉన్న ఏసి వెంట్స్, డ్యాష్‌బోర్డుకు ఎడమవైపున చివరలో క్రింది భాగంలో ఇచ్చిన గ్లోవ్ బాక్స్ గుర్తించవచ్చు. అదే విధంగా, కారుకు సంభందించిన పూర్తి సమచారాన్ని డ్రైవర్‌కు అందజేయడంలో కీలకపాత్ర పోషించే డిస్ల్పే ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఉంది.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లోని సెంటర్ కన్సోల్ మీద మధ్యలో పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో వచ్చన కీలకమైన ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. సెగ్మెంట్ ఫస్ట్ రూఫ్ మీద అందించిన సరౌండింగ్ క్లైమేట్ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. అదే విధంగా స్టీరింగ్ మీద పలు సిల్వర్ బటన్స్ ఉన్నాయి.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

మహీంద్రా మరాజొ సాంకేతికంగా వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే, ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ పరంగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. తరువాత దశలో ఇందులో పెట్రోల్ ఇంజన్ కూడా పరిచయం కానుంది.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దేశీయంగా 7 నుండి 8 మంది వరకు కుటుంబసమేత ప్రయాణ అవసరాలకు ఎమ్‌పీవీ వాహనాలు ఎంతో అనువైనవి. ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మారుతి సుజుకి ఎర్టిగా కార్లకు పోటీగా మహీంద్రా సరికొత్త మరాజొ ఎమ్‌పీవీని సిద్దం చేసింది. దీనిని వచ్చే పండుగ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Marazzo MPV Cabin Revealed Ahead Of Launch
Story first published: Thursday, August 16, 2018, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X