ఇన్నోవా క్రిస్టా మరియు టాటా హెక్సాకు పోటీగా మహీంద్రా మరాజో ఎమ్‌పీవీ

మహీంద్రా అధికారికంగా మరాజొ ఎమ్‌పీవీ వెహికల్ టీజర్‌ను లాంచ్ చేసింది. మహీంద్రా గత కొంత కాలంగా యు321 కోడ్ పేరుతో పరీక్షించిన ఎమ్‌పీవీకీ నేడు మరాజొ అనే పేరును అధికారికంగా ఖరారు చేసింది.

By Anil Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా మరాజొ ఎమ్‌పీవీ వెహికల్ టీజర్‌ను లాంచ్ చేసింది. మహీంద్రా గత కొంత కాలంగా యు321 కోడ్ పేరుతో పరీక్షించిన ఎమ్‌పీవీకీ నేడు మరాజొ అనే పేరును అధికారికంగా ఖరారు చేసింది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మరాజొ అనే పేరును స్పానిష్ ఉప-భాష నుండి సేకరించారు. మరాజొ అంటే షార్క్ చేప రూపం అనే అర్థం వస్తుంది. దేశీయ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు టాటా హెక్సా మోడళ్లకు సరాసరి పోటీగా మహీంద్రా అండ్ మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని సిద్దం చేసింది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

గత కొన్ని నెలలుగా అప్‌కమింగ్ మహీంద్రా యు321 మోడల్ విడుదల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. గతంలో మార్కెట్ నుండి వైదొలగిన జైలో వాహనాన్ని ఇది భర్తీ చేస్తుందనే కథనాలు కూడా వినిపించాయి. నేడు ముంబాయ్ నగర వేదికగా జరిగిన కార్యక్రమంలో యు321 వాహనాన్ని ఇండియన్ ఎమ్‌పీవీ సెగ్మంట్లోకి ఒక కొత్త మోడల్‌గా ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

ఉత్తర అమెరికాలోని మిచిగావ్‌లో ట్రాయ్ సమీపంలో ఉన్న కంపెనీ యొక్క టెక్నికల్ సెంటర్, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఈ ఎమ్‌పీవీని రూపొందించి, దీనికి యు321 అనే కోడ్ పేరు పెట్టారు. ప్రొడక్షన్ వెర్షన్ యు321 మోడల్‌కు మరాజొ అనే పేరును ఖాయం చేశారు, ఇండియాతో పలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా వెల్లడించింది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ 7 మరియు 8 సీటింగ్ లేఔట్లలో లభ్యమవుతుంది. మరియు వెనుక వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో మలిపివేసే అవకాశం ఉంది. మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ప్రపంచ శ్రేణి ఇంటీరియర్స్ అందివ్వడం జరిగింది. ప్రత్యేకించి రూఫ్-మౌంటెడ్ ఏసి వెంట్స్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉన్నాయి.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. గతంలో రహస్యంగా లీక్ అయిన ఇంటీరియర్ ఫోటోల ప్రకారం, పియానో బ్లాక్ డ్యాష్‌బోర్డ్ మరియు బీజీ కలర్ ఇంటీరియర్ ఎలిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ వాహనంలో సాంకేతికంగా 1.6-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజన్ రానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇంజన్ 125బిహెచ్‌పి పవర్ మరియు 305ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మహీంద్రా మరాజొ పెట్రోల్ యూనిట్లో కూడా వస్తుందనే కథనం ఉంది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా అండ్ మహీంద్రా సేఫ్టీ పరంగా మరాజొ ఎమ్‌పీవీ వాహనంలో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు రివర్స్ పార్కింగ్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా అందిస్తోంది. సాధారణ రెగ్యులర్ ఛాసిస్ మీద కాకుండా మోనోకోక్యూ ఛాసిస్ మీద మరాజొ వాహనాన్ని నిర్మించారు.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా తమ మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని ఈ ఏడాది పండుగ సీజన్‌లో దీపావళి సందర్భంలో విక్రయాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో విడుదల చేయనుంది. ప్రొడక్షన్ మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ధరల శ్రేణి రూ. 11 - 17 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు టాటా హెక్సా మోడళ్లకు పోటీగా తీసుకొస్తున్న ప్రీమియం ఎమ్‌పీవీ మరాజొ వాహనంతో భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. కుటుంబ మరియు వ్యాపార అవసరాలకు మరాజొ ఎంతో చక్కగా సరిపోతుంది. సేఫ్టీ, సౌకర్యం మరియు ఫీచర్లను సమపాళ్లలో అందించింది సక్సెస్ అందుకోవాలని చూస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Marazzo aka U321 MPV Officially Teased — Rivals The Toyota Innova Crysta
Story first published: Tuesday, July 31, 2018, 18:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X