తుది పరీక్షల్లో మహీంద్రా మరాజొ

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సెప్టెంబర్ 3, 2018న విపణిలోకి సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సెప్టెంబర్ 3, 2018న విపణిలోకి సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

విడుదల నేపథ్యంలో మహీంద్రా మరాజొకు తుది పరీక్షలు నిర్వహిస్తుండగా, రహస్యంగా సేకరించిన ఫోటోలు మహీంద్రా మరాజొ దాని అసలు రూపాన్ని బయటపెట్టాయి. మహీంద్రా మరాజొ ఫోటోలు మరియు పూర్తి వివరాల కోసం...

మహీంద్రా మరాజొ

తాజాగా లీక్ అయిన ఫోటోలలో మహీంద్రా మరాజొ షార్క్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు అల్లాయ్ వీల్స్ స్పష్టంగా చూడవచ్చు. మరాజొ ఫ్రంట్ డిజైన్‌లో పదునైన పళ్లు గల క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ కలదు, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఉంది.

మహీంద్రా మరాజొ

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఇది 7 మరియు 8 సీటింగ్ లేఔట్లలో లభ్యం కానుంది. 7-సీటర్ వేరియంట్లోని మధ్య వరుసలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే పైలెట్ సీటింగ్ మరియు 8-సీటర్ వేరియంట్లోని మధ్య వరుసలో ముగ్గురు కూర్చునే వీలున్న ఫోల్డబుల్ సీటు కలదు.

మహీంద్రా మరాజొ

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌ డ్యూయల్-టోన్ థీమ్ ఫినిషింగ్‌లో ఉంది. బ్ల్యాక్ డ్యాష్‌బోర్డ్ మరియు బీజీ కలర్‌లో ఉన్న సీట్లు మరియు డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డు మీద ఫాక్స్ సిల్వర్ మేళవింపులు ఇంటీరియర్ మొత్తాన్ని విలాసవంతమైన రూపాన్ని తీసుకొచ్చాయి. 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

మహీంద్రా మరాజొ

మరాజొ ఎమ్‌పీవీ ఇంటీరియర్‌లో రూఫ్ మీద అందించిన ఏసి వెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాబిన్ మొత్తానికి ఎంతో సులభంగా చల్ల గాలిని అందిస్తాయి. ఈ సెగ్మెంట్లో తొలిసారిగా వచ్చిన సరౌండ్ కూల్ టెక్నాలజీ మరాజొ ద్వారా పరిచయం అవుతోంది.

మహీంద్రా మరాజొ

మహీంద్రా తమ మరాజొ ఎమ్‌పీవీలో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను తప్పనిసరిగా అందిస్తోంది.

మహీంద్రా మరాజొ

సాంకేతికంగా మహీంద్రా మరాజొలో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 121బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మలి దశ క్రింద ఇందులో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పరిచయం అవకాశం ఉంది.

మహీంద్రా మరాజొ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుధీర్ఘ పరీక్షల అనంతరం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు తమ మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని దేశీయంగా ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యింది. ఇండియన్ మార్కెట్లోని ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి విడుదల కానున్న మహీంద్రా మరాజొ ఇదే సెగ్మెంట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు అతి త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వంటి మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Marazzo Spotted Testing Again — Reveals Shark LED Tail Lights And Alloy Wheels
Story first published: Tuesday, August 21, 2018, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X