మార్కెట్‌కు శాశ్వతంగా దూరమవుతున్న మహీంద్రా నువోస్పోర్ట్

ప్రస్తుతం నువోస్పోర్ట్ సేల్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో నష్టాల బారిన పడకుండా ఉండేందుకు మహీంద్రా నువోస్పోర్ట్‌ను మార్కెట్ నుండి తొలగించే అవకాశం ఉంది.

By Anil Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీల విభాగంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు నూతన మోడళ్లను ప్రవేశపెడుతూనే ఉంటుంది. సరిగ్గా 2016లో క్వాంటో కారును భర్తీ చేస్తూ సబ్-4-మీటర్ ఎస్‌యూవీగా జైలో ఆధారంతో నువోస్పోర్ట్ ఎస్‌యూవీని విపణిలోకి ప్రవేశపెట్టింది.

మహీంద్రా నువోస్పోర్ట్

జైలో ఎస్‌యూవీ లక్షణాలతోనే స్వల్ప డిజైన్ మార్పులతో నువోస్పోర్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చినప్పటికీ కస్టమర్లను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నువోస్పోర్ట్ సేల్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో నష్టాల బారిన పడకుండా ఉండేందుకు మహీంద్రా నువోస్పోర్ట్‌ను మార్కెట్ నుండి తొలగించే అవకాశం ఉంది.

మహీంద్రా నువోస్పోర్ట్

2018 ప్రారంభం నుండి నువోస్పోర్ట్ సేల్స్ సరిగా లేవు. కొన్ని నెలల పాటు కేవలం ఒక్క యూనిట్ మాత్రమే అమ్ముడుపోయింది. దేశవ్యాప్తంగా నువోస్పోర్ట్ సేల్స్ దాదాపు నిలిచిపోయాయి. ఈ తరుణంలో మహీంద్రా అధికారికంగా మార్కెట్ నుండి దీనిని తొలగించే అవకాశం ఉంది.

మహీంద్రా నువోస్పోర్ట్

7-సీటింగ్ కెపాసిటీతో లభించే అది కొద్ది ఎస్‌యూవీలలో నువోస్పోర్ట్ ఒకటి. అయితే, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి మహీంద్రా లాంచ్ చేసిన టియువి300 నువోస్పోర్ట్ సేల్స్ తినేస్తున్నట్లు తెలిసింది.

మహీంద్రా నువోస్పోర్ట్

నిజమే, డిజైన్, స్టైలింగ్ మరియు ఫీచర్లు టియువి300 బాగానే ఉంటుంది. ధరలు కూడా దాదాపు ఒకేలా ఉండటంతో కస్టమర్లు ఎక్కుగా టియువి300 ఎస్‌యూవీకే మొగ్గు చూపుతున్నారు.

మహీంద్రా నువోస్పోర్ట్

మహీంద్రా నువోస్పోర్ట్ ఎస్‌యూవీలో 6.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ ఇమ్మొబిలైజర్ ఇంకా ఎన్నో కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా నువోస్పోర్ట్

మహీంద్రా నువోస్పోర్ట్ మోడల్‌ను నిజంగానే డిస్కంటిన్యూ చేస్తే, టియువి300 మరియు ఇటీవల విడుదల చేసిన టియువి300 ప్లస్ 9-సీటర్ ఎస్‌యూవీల సేల్స్ మీద దృష్టి సారించవచ్చు. ప్రస్తుతానికి వీటి సేల్స్ ఆశాజనకంగానే ఉన్నాయి.

మహీంద్రా నువోస్పోర్ట్

మహీంద్రా టియువి300 ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా నువోస్పోర్ట్

మహీంద్రా టియువి300 ఎస్‌యూవీ డిజైన్, పనితీరు మరియు ధరల పరంగా విపణిలో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్, రెనో డస్టర్, మారుతి వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

Source: AutoX

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2018, 10:14 [IST]
English summary
Read In Telugu: Mahindra NuvoSport Discontinued In India Due To Lack Of Sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+