ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్‌లకు పోటీగా మహీంద్రా సిద్దం చేసిన ఎస్‌యూవీ

Written By:

భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో జి4 రెక్ట్సాన్ ప్రీమియం ఎస్‌యూవీని ఆవిష్కరించింది. మహీంద్రా ఈ ఎస్‌యూవీని ఇప్పటికే పలుమార్లు పరీక్షించింది.

అయితే తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మహీంద్రా అండ్ మహీంద్రా రెక్ట్సాన్ ఎస్‌యూవీని ఈ ఏడాది పండుగ సీజన్ నాటికల్లా విడుదల చేయడానికి సన్నద్దమవుతున్నట్లు తెలిసింది.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

రెక్ట్సాన్ ఎస్‌యూవీతో పాటు పలు ఇతర మోడళ్లను కూడా లాంచ్ చేయాలని మహీంద్రా భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన యు321 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ఎమ్‌పీవీని కూడా విడుదలకు ఖరారు చేసింది.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

మహీంద్రా ఈ సెకండ్ జనరేషన్ రెక్ట్సాన్ ఎస్‌యూవీని ప్రీమియం మోడల్‌గా ఎక్స్‌యూవీ700 పేరుతో విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ జనరేషన్ రెక్ట్సాన్ ఎస్‌యూవీని మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ శాంగ్‌యాంగ్ బ్యాడ్జ్ పేరుతో విక్రయించేది, అయితే ఈ మోడల్ ఖచ్చితంగా మహీంద్రా బ్యాడ్జింగ్‌తో రానుంది.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

కానీ, మహీంద్రా రెక్ట్సాన్ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న రెగ్యులర్ వెర్షన్ రెక్ట్సాన్ స్థానాన్ని భర్తీ చేయదు. మహీంద్రా బ్యాడ్జింగ్ గల రెక్ట్సాన్ ఇండియన్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం. ఇండియన్ వెర్షన్ రెక్ట్సాన్ ఫ్రంట్ డిజైన్‌లో మహీంద్రా వారి ఫ్రంట్ గ్రిల్ మరియు పలు డిజైన్ అంశాలు ఉన్నాయి. అంతే కాకుండా దేశీయ రహదారి పరిస్థితులకు అనుగుణంగా ఎత్తైన రైడ్ మరియు మెరుగుపరిచిన సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో ఉంది.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

సాంకేతికంగా మహీంద్రా రెక్ట్సాన్ ఎస్‌యూవీలో 178బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. రెక్ట్సాన్ ఎస్‌యూవీ టు-వీల్-డ్రైవ్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ ఆప్షన్‌లలో లభించే అవకాశం ఉంది.

Recommended Video - Watch Now!
Mahindra Rexton Quick Look; Specs, Interior And Exterior - DriveSpark
మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

మహీంద్రా రెక్ట్సాన్ క్యాబిన్ విశాలమైన మూడు వరుసల సీటింగ్ లేఔట్లో 7-మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెక్ట్సాన్ ఇంటీరియర్‌లో 8-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిక్లైనింగ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

భద్రత పరంగా మహీంద్రా రెక్ట్సాన్ ఎస్‌యూవీలో తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, హైబీమ్ అసిస్ట్, మరియు ట్రాఫిక్ సేఫ్టీ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

మహీంద్రా రెక్ట్సాన్ ఎస్‌యూవీని విడి భాగాల రూపంలో దిగుమతి చేసుకుని, మహీంద్రా చకన్ ప్లాంటులో పూర్తి స్థాయిలో అసెంబుల్ చేసి విక్రయించనున్నట్లు తెలిసింది. ఎస్‌యూవీ వాహనాలకు పేరుగాంచిన మహీంద్రా రెక్ట్సాన్ ఎస్‌యూవీని ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీగా అందుబాటులో ఉంచనుంది.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా రెక్ట్సాన్ భారతదేశపు ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వస్తుంది. ఇది విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. మహీంద్రా రెక్ట్సాన్ ధరల శ్రేణి అంచనాగా రూ. 22 లక్షల నుండి రూ. 27 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా రెక్ట్సాన్ ఎస్‌యూవీలో స్వల్ప అప్‌డేట్స్ నిర్వహించారు.

మహీంద్రా రెక్ట్సాన్ విడుదల వివరాలు

1. కస్టమర్‌ను మోసం చేసినందుకు 9.23 లక్షలు జరిమానా విధించిన కోర్టు

2.ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన మహీంద్రా ఎమ్‌పీవీ

3.కారుకు కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

4.కొని నెల కూడా కాలేదు బుగ్గిపాలైన 30 లక్షల కారు

5.టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

English summary
Read In Telugu: Mahindra Rexton Launch Details Revealed; Expected Price, Specs And Features
Story first published: Monday, April 16, 2018, 11:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark