ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని మళ్లీ పరీక్షించిన మహీంద్రా

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్దమవుతోంది. తాజాగా ప్రొడక్షన్ వెర్షన్ ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని పరీక్షించి

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్దమవుతోంది. తాజాగా ప్రొడక్షన్ వెర్షన్ ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని పరీక్షించింది.

మహీంద్రా ఎస్201

మహీంద్రా ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీని శాంగ్‌యాంగ్ టివోలి ఎస్‌యూవీ ఆధారంగా డెవలప్ చేశారు. రహస్యంగా సేకరించిన ఎస్201 మోడల్ ఫోటోలలో డిజైన్ ఎలిమెంట్స్ గమనించడానికి వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ కలర్ పేపరుతో కప్పేసిన బాడీని గుర్తించవచ్చు.

మహీంద్రా ఎస్201

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో బ్లాక్ స్ట్రిప్ వ్రాప అరౌండ్ గల ప్రొడక్షన్ వెర్షన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అంతే కాకుండా, ఎస్‌యూవీలో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ ల్యాంప్స్, క్రోమ్ ఎలిమెంట్స్ గల ఫ్రంట్ గ్రిల్, భారీ ఎయిర్ ఇంటేకర్ గల బంపర్ మరియు హారిజంటల్ ఫాగ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా ఎస్201

మహీంద్రా ఎస్201 సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, అధునాతన స్పోర్టివ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, పెద్ద పరిమాణంలో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల స్వెప్ట్ బ్యాక్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎస్201

గతంలో పరీక్షించిన మహీంద్రా ఎస్201 మోడల్‌ను గమనిస్తే ఎక్కువ ఎత్తులో అందించిన స్టాప్ ల్యాంప్స్ మరియు స్పాయిలర్ ఉన్నాయి. ఎస్201 సబ్-ఫోర్-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ క్యాబిన్ వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా ఎస్201

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీలో పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ, ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, న్యూ స్టీరింగ్ వీల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు పరిచయం కానున్నాయి.

మహీంద్రా ఎస్201

సరికొత్త మహీంద్రా ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా లైనప్‌లో ఉన్న 1.2 మరియు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. ట్రాన్స్‌మిషన్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంచుకునే అవకాశం ఉంది.

మహీంద్రా ఎస్201

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అతి త్వరలో విడుదల కానున్న మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ టియువి300 మరియు నువోస్పోర్ట్ తర్వాత కంపెనీ నుండి వస్తోన్న మూడవ సబ్-ఫోర్-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. మహీంద్రా ఎస్201 పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Image Source: TeamBHP

More from DriveSpark

Article Published On: Saturday, July 14, 2018, 11:15 [IST]
English summary
Read In Telugu: Mahindra S201 Compact-SUV Spied Testing Again
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+