ఆటో ఎక్స్‌పో ద్వారా మరో సంచలనానికి తెరదించిన మహీంద్రా

మహీంద్రా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద సరికొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి సిద్దమైంది.

By Anil

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద సరికొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ప్రమోషనల్ టీజర్‌లో ఎస్‌యూవీ వివరాలు రివీల్ చేసింది.

మహీంద్రా నుండి వస్తున్న భారతదేశపు తొలి కన్వర్టిబుల్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో....

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

ఎస్‌యూవీల విభాగంలో ఇప్పటి వరకు కన్వర్టిబుల్ ఎస్‌యూవీ రాలేదు. ఇండియన్ ఆడియెన్స్ కోసం మహీంద్రా అండ్ మహీంద్రా కన్వర్టిబుల్ పరిచయం చేసి, సరికొత్త ప్రయోగానికి తెరదించుతోంది. ఆటోమొబైల్ ఔత్సాహికులతో పాటు, పలు మీడియా వెబ్‌సైట్లు కూడా ఈ మోడల్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

మహీంద్రా తమ కన్వర్టిబుల్ ఎస్‌యూవీని స్టింగర్ పేరుతో కొన్ని టీజర్ ఫోటోలను మరియు టీజర్‍‌లను రివీల్ చేసింది. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కండలు తిరిగిన ఆకృతి, దప్పంగా ఉన్న క్యారెక్టర్ లైన్స్ మరియు ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ ఉన్నాయి.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

స్టింగర్ కన్వర్టిబుల్ రియర్ డిజైన్‌లో ఉన్న స్లోపింగ్ రూఫ్‌లైన్ ఎస్‌‌యూవీకి కూపే స్టైల్ రూపాన్ని తీసుకొచ్చింది. రియర్ డిజైన్‌లో అదనంగా మరో వీల్‌ను తీసుకెళ్లే అరేంజ్‌మెంట్ ఉంది.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ ఈ కన్వర్టిబుల్ ఎస్‌యూవీని ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో తమ అధికారిక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా టీజర్ వీడియోను లాంచ్ చేసింది. వీడియో ప్రకారం, ఇది 7-సీటర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ అని తెలిసింది.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

స్టింగర్ 4-సీటింగ్ లేఔట్లో మూడు డోర్లతో వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించిన మోడల్‌ను పరిశీలించినట్లయితే, తక్కువ ఎత్తులో ఉన్న రూఫ్ టాప్ ద్వారా ఎస్‌యూవీ స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంది.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

స్టింగర్ 4-సీటింగ్ లేఔట్లో మూడు డోర్లతో వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించిన మోడల్‌ను పరిశీలించినట్లయితే, తక్కువ ఎత్తులో ఉన్న రూఫ్ టాప్ ద్వారా ఎస్‌యూవీ స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంది.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

మహీంద్రా ఏరో కాన్సెప్ట్ డిజైన్ లక్షణాలను అతి త్వరలో రానున్న స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ స్వల్ప మేర పంచుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా, కన్వర్టిబుల్ ఎస్‌యూవీలో మహీంద్రా లైనప్‌లో ప్రసిద్దిగాంచిన ఎమ్‌హాక్ ఇంజన్‌ వచ్చే వకాశం ఉంది.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

కన్వర్టిబుల్ తరహా ఎస్‌యూవీలు ఇండియన్స్‌కు కొత్తే అయినప్పటికీ, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు, ఆకర్షణీయమైన ఎక్ట్సీరియర్ డిజైన్‌ మరియు ప్రీమియమ్ ఫీలింగ్ కలిగించే లక్షణాలతో మహీంద్రా ఇండియా యొక్క అత్యంత ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీగా నిలవనుంది.

మహీంద్రా స్టింగర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ

ప్రస్తుతం దీనిని డిజిటల్ రూపంలో ఆవిష్కరించిన మహీంద్రా పూర్తి స్థాయిలో ఆటో ఎక్స్‌పో 2018 వాహన ప్రదర్శన వేదికలో ఆవిష్కరించనుంది. మహీంద్రాతో పటు పలు కార్లు మరియు బైకుల దిగ్గజ కంపెనీలు తమ ఫ్యూచర్ ఉత్పత్తులను ఆవిష్కరించడానికి సిద్దమయ్యాయి. మినిట్-టు-మినిట్ అప్‌‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగులో కలిసి ఉండండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Monday, February 5, 2018, 12:12 [IST]
English summary
Read In Telugu: Mahindra Stinger Convertible SUV Concept — To Unveil At The Auto Expo 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+