మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

మహీంద్రా ఇటీవల విపణిలోకి 9-సీటర్ టియువి300 ప్లస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు అభిరుచికి తగ్గట్లుగా, టియువి300 ప్లస్ వెహికల్‌ను ఎంచుకునే వారికోసం పలు విభిన్న యాక్ససరీలను ప్రవేశపెట

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ఎస్‌యూవీ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విపణిలోకి 9-సీటర్ టియువి300 ప్లస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు అభిరుచికి తగ్గట్లుగా, టియువి300 ప్లస్ వెహికల్‌ను ఎంచుకునే వారికోసం పలు విభిన్న యాక్ససరీలను ప్రవేశపెట్టింది.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

స్టైలింగ్, సౌకర్యం, యుటిలిటి మరియు ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అవసరాలకు సంభందించిన యాక్ససరీలను ప్రవేశపెట్టింది. మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో వివరంగా...

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

ఎస్‌యూవీ మరింత అట్రాక్టివ్‌ లుక్‌లో కనిపించేందుకు, డీఆర్ఎల్స్, క్రోమ్ ఫినిషింగ్ గల ఫాగ్ ల్యాంప్, క్రోమ్ క్యాపులున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ విండో లైన్స్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్ సొబగులను ఎంచుకోవచ్చు.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

మహీంద్రా ప్రవేశపెట్టిన యాక్ససరీల జాబితాలో 16-అంగుళాల్ అల్లాయ్ వీల్స్ లేదా 16-అంగుళాల వీల్ కవర్స్, స్టెయిన్ లెస్ స్టీల్ స్కఫ్ ప్లేట్లు లేదా ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ప్రొజెక్టర్స్ మరియు స్పోర్టివ్ పెడల్స్ ఉన్నాయి. అదనపు యాక్ససరీలతో టియువి300 ప్లస్ చాలా ప్రీమియం ఎస్‌యూవీగా కనబడుతుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

నొక్కులు మరియు గీతల నుండి మహంద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీని రక్షించుకునేందుకు కూడా యాక్ససరీలను తీసుకొచ్చింది. అవును, నాలుగు విభిన్న డిజైన్‌లలో ఫ్రంట్ కవరింగ్ గార్డ్స్, బాడీ సైడ్ మౌల్డింగ్ మరియు ఓవర్ రియర్ గార్డ్ లేదా స్టెప్ట్‌డ్ రియర్ గార్డ్ ఉన్నాయి. రూఫ్ క్యారీయర్ మరియు హ్యాండి ర్యాక్ క్యారీయర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

మహీంద్రా అందిస్తున్న యాక్ససరీలలో కంఫర్ట్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కూడా ఉన్నాయి. అల్యూమినియం సైడ్ స్టెప్స్, ఆడియో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఆడియో అప్‌గ్రేడ్ కిట్, హెడ్స్-అప్ డిస్ల్పే, 7-ఇంచ్ డిస్ల్పే గల రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, కార్ ఇన్వర్టర్ మరియు యూఎస్‌బి ఛార్జర్‌తో పాటు కార్ చిల్లర్, వార్మర్ మరియు సీట్ కవర్లు లభిస్తున్నాయి.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

మహీంద్రా టియువి300 ప్లస్ పి8 వేరియంట్లో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా పొందవచ్చు, పి4 మరియు పి6 వేరియంట్లను ఎంచుకునే కస్టమర్లు కూడా రివర్స్ కెమెరా మరియు ప్రత్యేకమైన డిస్ల్పే లేదా ఐఆర్‌వీఎమ్ మౌంటెడ్ స్క్రీన్ అదనపు యాక్ససరీగా పొందుతారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఏ వేరియంట్ల కూడా లభించడంలో లేదు, అయితే అదనపు యాక్ససరీగా ఎంచుకోవచ్చు.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

మహీంద్రా టియువి300 ప్లస్ 9-సీటర్ ఎస్‌యూవీలో సాంకేతికంగా సరికొత్త 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డి120 డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

మహీంద్రా టియువి300 ప్లస్ 9-సీటర్ ఎస్‌యూవీలో సాంకేతికంగా సరికొత్త 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డి120 డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ యాక్ససరీలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా తమ టియువి300 ఆధారంతో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచి టియువి300 ప్లస్ పేరుతో లాంచ్ చేసింది. కుటుంబ సమేతంగా చేసే దూర ప్రయాణాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పెద్ద ఫ్యామిలీ లేదా ఉమ్మడి కుటుంబ అవసరాలకు దీనిని ఎంచుకోవచ్చు. స్టైల్, కంఫర్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లను పెంచేందుకు ప్రత్యేకించి టియువి300 ప్లస్ కోసం ప్రత్యేకమైన యాక్ససరీలను పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు మరియు ధరల కోసం సమీపంలోని మహీంద్రా డీలర్లను సంప్రదించగలరు.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra TUV300 Plus Accessories Revealed
Story first published: Wednesday, June 27, 2018, 10:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X