అనూహ్య నిర్ణయం తీసుకున్న మహీంద్రా: ఒకేసారి నాలుగు మోడళ్లకు వీడ్కోలు

మహీంద్రా ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ వాహణ శ్రేణిలో ఒకేసారి నాలుగు మోడళ్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

By Anil

Recommended Video

Auto Expo 2018: Mahindra Thar Wanderlust Specs, Features, Details - DriveSpark

భారతదేశపు అతి పెద్ద యుటిలిటి వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మహీంద్రా ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ వాహణ శ్రేణిలో ఒకేసారి నాలుగు మోడళ్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

విక్రయాల్లో నెమ్మదిస్తున్న మోడళ్లను మార్కెట్ నుండి నిష్క్రమింపజేయాలని చూస్తోంది. ప్రధానంగా, వెరిటో సెడాన్, వెరిటో వైబ్ నాట్చ్‌బ్యాక్, జైలో ఎమ్‌పీవీ మరియు సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నువోస్పోర్ట్ మోడళ్లు అతి త్వరలో మార్కెట్‌కు శాశ్వతంగా దూరం కానున్నాయి.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, రానున్న 18 నుండి 24 నెలల్లోపు సందర్భానుసారంగా విపణి నుండి పైన పేర్కొన్న మోడళ్లను ఒక్కొక్కటిగా తొలగించే ఆలోచనలో ఉంది. ఏప్రిల్ 1, 2020 నుండి అమల్లోకి రానున్న నూతన ఉద్గార నిబంధనలు కూడా ఇందుకొక కారణం కానుంది.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

అంతే కాకుండా, మహీంద్రా అండ్ మహీంద్రా తమ అన్ని పాత మోడళ్లను కూడా బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో మరియు క్రాష్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, "మహీంద్రా వాహన సముదాయంలో ఉన్న అన్ని వాహనాలు కూడా బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించాలి. అంతే కాకుండా, బిఎస్-6 అప్‌గ్రేడ్ చేసే సమయానికి ఆశించిన ఫలితాలను కనబరచని మోడళ్లను మార్కెట్ నుండి తొలగించాలనే నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించాడు."

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

భవిష్యత్తులో వెహికల్ సేఫ్టీ విషయంలో తప్పనిసరిగా వస్తున్న సేఫ్టీ రెగ్యులేషన్స్‌ పాటించే ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు వాహన భద్రత విషయంలో పెట్టుబడి పెట్టనుంది. భవిష్యత్తులో మహీంద్రా తొలగిస్తున్న మోడళ్లను భర్తీ చేస్తూ, ఆయా సెగ్మెంట్లలో ఉన్న మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

మహీంద్రా తొలగించాలని భావిస్తున్న జైలో ఎస్‌యూవీ స్థానంలోకి, గత సంవత్సర కాలం నుండి పరీక్షిస్తున్న టియువి300 ప్లస్ ఎమ్‌పీవీని ప్రవేశపెట్టనుంది. తొమ్మిది మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న టియువి300 ప్లస్ జైలో ఎస్‌యూవీకి ఒక విలువైన భర్తీ అని చెప్పవచ్చు.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

క్యాబ్ సర్వీసులు అందించే సంస్థలకు మహీంద్రా వెరిటో అతి ముఖ్యమైన మోడల్‌గా నిలిచింది. ఏదేమైనప్పటికీ, నూతన ఫీచర్లు మరియు ఆకర్షణీయైన డిజైన్ అంశాలతో పోటీగా వచ్చిన కొత్త కార్లు మహీంద్రా వెరిటోను ప్రక్కకు నెట్టేశాయి.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

కంపెనీ తమ వెరిటో సెడాన్ కారు యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ఇవెరిటో కారును యథావిధిగా విక్రయించనుంది. మహీంద్రా లైనప్‌లో తక్కువగా అమ్ముడవుతున్న మోడల్ వెరిటో వైబ్ వ్యాపార కోణం నుండి చూస్తే ఈ మోడల్‌ను విక్రయించడం కంపెనీకి ఏ మాత్రం లాభదాయకం కాదు.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

మహీంద్రా నువోస్పోర్ట్ విషయానికి వస్తే, నూతన ఫీచర్లతో వచ్చిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. అయితే, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న టియువి300 ఎస్‌యూవీ సాధారణ ఫలితాలు సాధిస్తోంది.

నాలుగు మోడళ్లను మార్కెట్ నుండి తొలగిస్తున్న మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా ఉత్పత్తుల్లో కొన్నింటిని మార్కెట్ నుండి తొలగించి, మరికొన్ని ఉత్పత్తులను విడుదల చేసి, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చూస్తోంది. భద్రత మరియు ఉద్గార నియమ నిభందలను అనుసరిస్తూ పాత మోడళ్లను కొత్త మోడళ్లతో భర్తీ చేయడం మహీంద్రాకు శుభపరిణామమని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 20, 2018, 13:18 [IST]
English summary
Read In Telugu: Mahindra To Discontinue Four Vehicles — Models, Discontinuation Timeline & Why
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+