మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఆ ఒక్క వేరియంట్‌కు భారీ డిమాండ్

మహీంద్రా ఏప్రిల్ 2018లో కొత్త తరం ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులు చేర్పులతో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా అందిన సమాచా

By Anil Kumar

దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా ఏప్రిల్ 2018లో కొత్త తరం ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులు చేర్పులతో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 టాప్ ఎండ్ వేరియంట్ W11(O) కు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

అత్యధిక ప్రజాదరణ పొందుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 W11(O) వేరియంట్లో 155బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 W11(O) వేరియంట్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ధర రూ. 16.68 లక్షలు మరియు ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 17.88 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

డీలర్ల కథనం మేరకు, కొత్త తరం ఎక్స్‌యూవీ500 మునుపటి మోడల్ కంటే మంచి సేల్స్ సాధిస్తున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలతో పాటు జిల్లా స్థాయి నగరాల్లో కూడా ఈ ఎస్‌యూవీ మీద బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

అర్బన్ ఏరియాల్లో సగటున ఒక్కో డీలరు వద్ద 35 ఎస్‌యూవీలు బుక్ అవుతున్నాయి, అయితే మునుపటి తరం ఎక్స్‌యూవీ500 మీద 30 యూనిట్లు చొప్పున్న బుక్ అయ్యేవి. అదే విధంగా జిల్లా స్థాయి నగరాల్లో ఉన్న డీలర్ల వద్ద ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీల బుకింగ్స్ 8 నుండి 15 యూనిట్లకు పెరిగాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్ W11(O) మీద ఎక్కువ బుకింగ్స్ నమోదవుతున్నాయి. W11(O) వేరియంట్లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు, స్మార్ట్ వాచ్ కనెక్టివిటి మరియు 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

అంతే కాకుండా, 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ గల స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ మునుపటి రంగులతో పాటు అదనంగా మరో రెండు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, క్రిమ్సన్ రెడ్ మరియు మైస్టిక్ కాపర్. ఇతర కలర్ ఆప్షన్‌లలో ఒపులెంట్ పర్పుల్, వొల్కనో బ్లాక్, లేక్ సైడ్ బ్రౌన్, పర్ల్ వైట్ మరియు మూన్‌డస్ట్ సిల్వర్.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 విడుదలయ్యాక మునుపటి తరం కంటే కొత్త వెర్షన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొత్త తరం ఎక్స్‌యూవీలను షోరూముల్లో ప్రదర్శించిన తరువాత, వీటి సేల్స్ రెట్టింపు అయ్యాయని డీలర్లు తెలిపారు. ఏదేమైనప్పటికీ, విదేశీ సంస్థల పోటీని తట్టుకుని మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో బాగానే రాణిస్తోంది.

Source: Autocar India

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Mahindra XUV500 Top Variant In High Demand
Story first published: Tuesday, May 29, 2018, 19:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X