విపణిలోకి 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ విడుదల

దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది.

By Anil Kumar

దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12.32 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

మూడవ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 7-సీటర్ ఎస్‌యూవీలో ముందు మరియు వెనుక వైపున పలు మార్పులు చేర్పులు జరిగాయి. కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో పాటు అధునాతన ఇంజన్ అప్షన్‌లను కూడా పరిచయం చేసింది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

డిజైన్ మరియు స్టైలింగ్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి. ప్రదానంగా, సరికొత్త హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ డిజైన్. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను కూడా ఒక కొత్త లేఔట్లో డిజైన్ చేశారు. దప్పంగా మరియు విశాలమైన ఫ్రంట్ గ్రిల్ ఉంది. బంపర్ కూడా మార్పులకు గురయ్యింది, నూతన మోడల్‌లో క్రోమ్ మెరుగులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ఆల్ బ్లాక్ థీమ్ మరియు అత్యంత సౌకర్యవంతమైన లెథర్ సీట్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లోని అప్‌హోల్‌స్ట్రే మరియు సీటింగ్ లగ్జరీ ఫీల్ కలిగిస్తుంది. అంతే కాకుండా సరికొత్త ఎక్స్‌యూవీ500 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

వేరియంట్లు మరియు ధరలు

Diesel (In Lakh)
Variant MT

AT
W5 Rs 12.32
W7 Rs 13.58 Rs 14.78
W9 Rs 15.23 Rs 16.43
W11 Rs 16.43 Rs 17.63
W11 (O) Rs 16.68 Rs 17.88
Petrol (In Lakh)
G AT Rs 15.43
2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

ఇంజన్ స్పెసిఫికేషన్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఆరవ తరానికి చెందిన 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ ఉంది. ఇది 155బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు. పెట్రోల్ వెర్షన్ మునుపటి మోడల్‌తో పోల్చితే 140బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

ఫీచర్లు

అధునాతన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో 45 నుండి 50 వరకు ఫీచర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మొదటి సారి పరిచయమైన ఫీచర్లే ఉన్నాయి. 7-సీటర్ ఎస్‌యూవీలో బ్లూసెన్స్ ద్వారా స్మార్ట్‌వాచ్ కనెక్టివిటి ఫీచర్ ఉంది. ఈ సిస్టమ్ ఆడియో, ఏసి, డోర్లు, ఎమర్జెన్సీ అసిస్ట్, లొకేషన్ సర్వీసెస్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్‌లో ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఎకోసెన్స్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా అర్కామిస్ సంస్థ నుండి సేకరించిన అత్యుత్తమ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. అయితే, టైర్ మానిటరింగ్ సిస్టమ్ టైర్-ట్రోనిక్స్ పేరుతో పరిచయం చేసింది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

నాయిస్, వైబ్రేషన్స్ మరియు హార్స్‌నెష్ లెవల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఈ విషయంలో నూతన బాడీ ఇంజనీరింగ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అంతే కాకుండా, ఇంజన్ సౌండ్‌ను కూడా దాదాపుగా తగ్గించేశారు.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

భద్రత

సేఫ్టీ పరంగా సరికొత్త ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ టెక్నాలజీ వచ్చింది. అదే విధంగా నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

బుకింగ్స్ వివరాలు

మహీంద్రా విపణిలోకి లాంచ్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్‌యూవీ500 ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్ల వద్ద సిద్దంగా అందుబాటులో ఉంది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 లభించే రంగులు

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఏడు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. నూతన వెర్షన్ క్రిమ్సన్ రెడ్ మరియు మైస్టిక్ కాపర్ అనే రెండు విభిన్న రంగుల్లో లభిస్తోంది. ఎక్స్‌యూవీ500 లభించే ఇతర రంగుల్లో, ఒపులెంట్ పర్పుల్, వోల్వానో బ్లాక్, లేక్ సైడ్ బ్రౌన్, పర్ల్ వైట్ మరియు మూన్ డస్ట్ సిల్వర్.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఎన్నో కొత్త ఫీచర్లను అందించింది. డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా స్వల్ప మార్పులు జరగడంతో ఎస్‌యూవీ చూడటానికి అప్‌డేటెడ్‌గా కనిపిస్తోంది. వివిధ రకాల కస్టమర్ల కోసం అనేక రకాల బడ్జెట్ ఆప్షన్‌లలో ఎంచుకునేందుకు ఎన్నో రకాల వేరియంట్లను పరిచయం చేసింది.

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ విడుదల

More from DriveSpark

Article Published On: Wednesday, April 18, 2018, 21:25 [IST]
English summary
Read In Telugu: 2018 Mahindra XUV500 Launched; Prices Start At Rs 12.32 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+