మహీంద్రా వై400 7-సీటర్ ఎస్‌యూవీ: ఫార్చ్యూనర్‌కు సరాసరి పోటీ
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త వై400 (Mahindra Y400) ప్రీమియం ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇటీవల జరిగిన మహీంద్రా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇదే ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మహీంద్రా వై400 పేరుతో ఆవిష్కరించ
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త వై400 (Mahindra Y400) ప్రీమియం ఎస్‌యూవీని ఆవిష్కరించింది. మహీంద్రా తమ కొరియా భాగస్వామ్యపు దిగ్గజం శాంగ్‌యాంగ్ కంపెనీకి చెందిన రెక్ట్సాన్ మోడల్ ఆధారంగా రూపొందించిన ప్రీమియం ఎస్‌యూవీని జి40 పేరుతో ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది.

ఆ తరువాత ఈ ఎస్‌యూవీకి ఇండియన్ రోడ్ల మీద అత్యంత కఠిమైన పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి పై స్థానంలో రానున్న ఈ మోడల్‌ను ఎక్స్‌యూవీ700 పేరుతో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.

ఇటీవల జరిగిన మహీంద్రా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇదే ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మహీంద్రా వై400 పేరుతో ఆవిష్కరించారు. మహీంద్రా వై400 ప్రీమియం ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైన ప్రొడక్షన్ వెర్షన్ వై400 ఎస్‌యూవీ అని తెలుస్తోంది.

ప్రొడక్షన్ వెర్షన్ మహీంద్రా వై400 ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ స్లాట్ గ్రిల్, మరియు గ్రిల్ మీదుగా వెళ్లే అత్యంత ఆకర్షణీయమైన క్రోమ్ పట్టీ, కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేదా వై400 లోని బంపర్ డిజైన్ మరియు టెయిల్ ల్యాంప్ క్లస్టర్ శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‌యూవీలో ఉన్నట్లుగానే ఉన్నాయి. కొత్తగా డిజైన్ చేయబడిన స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్ పధాన ఆకర్షణగా నిలిచాయి.
Image Courtesy: CNBC-TV18

మహీంద్రా వై400 ప్రీమియం ఎస్‌యూవీ 7-సీటింగ్ లేఔట్లో లభ్యం కానుంది. మరియు అత్యంత విశాలమైన క్యాబిన్ దీని సొంతం. ఇంటీరియర్‌లో అత్యంత విలాసవంతమైన ప్రీమియం లెథర్ సీట్ అండ్ అప్‌హోల్‌స్ట్రే కలదు. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా వస్తోంది.

మహీంద్రా వై400 ఎస్‌యూవీలో భద్రత పరంగా తొమ్మిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్, రియర్ విండ్‌స్క్రీన్ డీఫాగర్, స్పీడ్ సెన్సిటివ్ స్టీరింగ్ వీల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు యాక్టివ్ రోల్ఓవర్ ప్రొటెక్షన్ వంటి అత్యాధుని మరియు కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా వై400 ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.2-లీటర్ సామర్థ్యం గల టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా ఎట్టకేలకు ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలోకి వై400 ఫుల్ సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఆధారంగా వచ్చిన ఎక్స్‌యూవీ700 లేదా వై400 ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.


Click it and Unblock the Notifications








