పరీక్షిస్తూ పట్టుబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700
మహీంద్రా విపణిలోకి సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ జి4 ఎస్‌యూవీ యొక్క రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌గా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో
దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ జి4 ఎస్‌యూవీ యొక్క రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌గా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018 వేదిక మీద ఆవిష్కరించింది.

ప్రస్తుతం, మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది అంతే కాకుండా అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

మహీంద్రా ఈ ఎస్‌యూవీ పేరును అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. కానీ, కంపెనీ యొక్క వాహన శ్రేణి మరియు ఆ వాహనాల పేర్లను పరిశీలిస్తే, దీనిని ఎక్స్‌యూవీ700 పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విపణిలో ఎక్స్‌యూవీ500 మంచి పాపులారిటీని దక్కించుకోవడంతో దానికి కొనసాగింపుగా రెక్ట్సాన్ జి4 ఎస్‌యూవీకి ఎక్స్‌యూవీ700 పేరునే ఖాయం చేసే ఛాన్స్ ఉంది.

మునుపటి తరానికి చెందిన రెక్ట్సాన్ ఎస్‌యూవీ శాంగ్‌యాంగ్ బ్రాండ్ పేరుతో అమ్ముడయ్యేది. అయితే, భారత్‌లో కస్టమర్లను ఆశించి మేర ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలో, ఇండియన్ మార్కెట్లో మహీంద్రాతో జట్టు కట్టిన శాంగ్‌యాంగ్ సంస్థ తమ రెక్ట్సాన్ ఎస్‌యూవీని మహీంద్రా బ్రాండ్ పేరు మరియు ఎక్స్‌యూవీ700 మోడల్ పేరుతో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఏడు మంది కూర్చుకునే సామర్థ్యం గల ప్రీమియమ్ లగ్జరీ ఎస్‌యూవీ. సాంకేతికంగా ఇందులో 2.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. మెర్సిడెస్ బెంజ్ నుండి సేకరించిన 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 178బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో రియర్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందించే అవకాశం ఉంది. ఆన్ రోడ్‌తో పాటు ఆఫ్ రోడింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంది. కానీ, విలాసవంతమైన ఫీచర్లు మరియు లగ్జరీ ఎస్‌యూవీలను తలదన్నే లక్షణాలతో వస్తుండటంతో ఇది పక్కా ఆన్ రోడ్ ప్రియులను ఆకట్టుకునే ఎస్‌యూవీగా చోటు స్థానం సంపాదించుకోనుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎన్నో విలాసవంతమైన ఫీచర్లతో వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ700 విపణిలో లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. క్యాబిన్‌లో అతి కీలకమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు సన్‌రూఫ్ ఇంకా ఎన్నో ఫీచర్లను కలిగి ఉంది.

భద్రత పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రివర్స్ పార్కింగ్ మరియు సెన్సార్లు వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీలకు మహీంద్రా అండ్ మహీంద్రా పెట్టింది పేరు. విపణిలో తమ స్థానాన్ని మరింత పధిలం చేసుకోవడానికి ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. ఏడు మంది ప్రయాణించే అవకాశం ఉన్న విలాసవంతమైన మహీంద్రా ఎక్స్‌యూవీ700 టయోటా పార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.
మహీంద్రా ఈ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి రూ. 25 లక్షల అంచనా ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








