భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదే!!
మారుతి సుజుకి బాలెనో కారును విడుదల చేసే వరకు ఇండియాలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉండేవి. సరిగ్గా 2015లో బాలెనో పరిచయంతో ఈ సెగ్మెంట్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. విడుదలై
మారుతి సుజుకి బాలెనో కారును విడుదల చేసే వరకు ఇండియాలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉండేవి. సరిగ్గా 2015లో బాలెనో పరిచయంతో ఈ సెగ్మెంట్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. విడుదలైన అనతి కాలంలోనే మారుతి బాలెనో భారీ సేల్స్ సాధించింది.

మారుతి బాలెనో ప్రీమియం హాచ్‌బ్యాక్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఏకంగా 4 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. అంటే సగటున రోజుకు 18,000 యూనిట్ల బాలెనో కార్లను మారుతి విక్రయించింది.

ఈ సేల్స్ భారతదేశపు రెండవ బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 నెలసరి విక్రయాల కంటే రెండు రెట్లు ఎక్కువ. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ మోడళ్లు బాలెనో రాకతో ఒక మెట్టు క్రిందకు దిగాయి.
అసలు మారుతి బాలెనో కారు ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి మరియు ఎంతో మంది కస్టమర్లు మారుతి బాలెనో కారునే ఎంచుకోవడానికి గల కారణాలేంటో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

మారుతి బ్రాండ్ విలువ
మార్కెట్లోకి ఏ కొత్త కారు విడుదలైనా... అతి ఎంత బాగుంది అనే దానికంటే, దానిని విడుదల చేసిన కంపెనీ ఏది అని చూసే కస్టమర్లు అధికంగా. ఈ లెక్క పరంగా చూసుకుంటే మారుతి విడుదల చేసే ప్రతి మోడల్ పట్ల మంచి ఆదరణ లభిస్తోంది. మారుతి సుజుకి దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటా సొంతం చేసుకుంది.

విపరీతమైన ఫీచర్లు
మారుతి సుజుకి చరిత్రలో తొలిసారి ప్రవేశపెట్టిన ఎన్నో నూతన ఫీచర్లు బాలెనో ద్వారా పరిచమయ్యాయి. బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, న్యావిగేషన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూవ్ కెమెరా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు
మారుతి సుజుకి తమ బాలెనో కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేఫ్టీ ఫీచర్లు అన్ని బాలెనో వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి.

నచ్చినట్లుగా మోడిఫై చేసుకోవచ్చు
చాలా మంది కస్టమర్లు అందరి కార్ల కంటే తమ కార్లు విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు మార్పులు చేర్పులు కోసం కస్టమైజేషన్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. కానీ, బాలెనో మోడిఫికేషన్ కోసం ఎవ్వరినీ ఆశ్రయించాల్సిన పనిలేదు. మారుతి సుజుకి స్వయంగా తమ బాలెనో కస్టమర్ల కోసం వివిధ రకాల డీకాల్స్ మరియు పలు రేసింగ్ స్ట్రిప్స్ గల మోఢిఫికేషన్స్ అందిస్తోంది.

మారుతి సుజుకి నెట్‌వర్క్
భారతదేశపు అత్యంత పురాతణమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి దేశవ్యాప్తంగా అత్యధిక సర్వీస్ సెంటర్లను కలిగి ఉంది. సువిశాల భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా మారుతి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. దీంతో బాలెనో సర్వీస్ చాలు సులభమైపోయింది.

మైలేజ్ రారాజులు
మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. మైలేజ్ పరంగా రెండు ఇంజన్‌లు కూడా ఛాంపియన్లని చెప్పవచ్చు. పెట్రోల్ బాలెనో లీటరుకు 21.4కిమీలు మరియు డీజల్ వెర్షన్ లీటరుకు 27.3కిమీల మైలేజ్ ఇస్తుంది. పర్ఫామెన్స్ ప్రియుల కోసం బాలెనో ఆర్ఎస్ మోడల్‍ను కూడా లాంచ్ చేసింది.

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు పట్ల ఆకర్షితులయ్యారు కదూ...? అయితే, బాలెనో లభించే వేరియంట్లు, వివిధ పట్టణాల వారీగా వాటి ధరలు మరియు బాలెనో ఫోటోలను చెక్ చేయండి.


Click it and Unblock the Notifications








