మారుతి సెలెరియో యాక్ససరీలు: ధరలు మరియు పూర్తి వివరాలు

మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఒరిజినల్ యాక్ససరీల జాబితా మారుతి వెల్లడించింది. దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2014లో సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును రూ. 4.19 లక్షల ఎక్స్

By Anil Kumar

మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఒరిజినల్ యాక్ససరీల జాబితా మారుతి వెల్లడించింది. దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2014లో సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును రూ. 4.19 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది.

మారుతి సెలెరియో యాక్ససరీలు

సాంకేతికంగా ఇందులో 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు. ఈ సెలెరియో సిఎన్‌జీ ఇంధనంతో కూడా నడుస్తుంది.

మారుతి సెలెరియో యాక్ససరీలు

మారుతి సెలెరియో గురించి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇండియన్ మార్కెట్లోకి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేసిన మొట్టమొదటి మోడల్ ఇదే. మారుతి ఇటీవల సెలెరియో కారును పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో సెలెరియో ఎక్స్ మోడల్‌ను లాంచ్ చేసింది.

మారుతి సెలెరియో యాక్ససరీలు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఎంతగానో ఆకట్టుకుంటున్న సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారు కోసం యాక్ససరీలను వెల్లడించింది. యాక్ససరీల వివరాలు మరియు వాటి ధరలు ఇవాళ్టి కథనంలో మీ కోసం...

మారుతి సెలెరియో యాక్ససరీలు

క్రోమ్ సొబగులు

ఎక్ట్సీరియర్ డిజైన్‌లో ఉండే క్రోమ్ ఎలిమెంట్లు ఇండియన్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సెలెరియోను ఎంచుకునే సామాన్యుల కోసం క్రోమ్ యాక్ససరీలను ఆప్షనల్‌్గా అందిస్తోంది. హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, మిర్రర్స్, డోర్లు మరియు డిక్కీ డోర్ మీద క్రోమ్ ఎలిమెంట్లను పొందవచ్చు.

  • ధర రూ. 690 నుండి 3,390 మధ్య
  • మారుతి సెలెరియో యాక్ససరీలు

    రెయిన్ గార్డ్స్ మరియు ఫైబర్ సొబగులు

    విపరీతంగా వర్షం కురుస్తున్నపుడు నీరు లోపలికివ వస్తుందనే ఆలోచన లేకుండా కిటికీ అద్దాలను కొద్ది మేర క్రిందకు దించుకోవడానికి రెయిన్ గార్డ్స్ ఎంతగానో సహకరిస్తాయి. మరియు కారు పక్కవైపులా అదే విధంగా బంపర్ల మీద ఫైబర్ బీడింగ్స్ ఉన్నాయి.

    ధర:

    • రెయిన్ గార్డ్స్ - రూ. 990
    • ఫైబర్ ఎలిమెంట్లు - రూ. 450 నుండి రూ. 1200 మధ్య
    • మారుతి సెలెరియో యాక్ససరీలు

      బాడీ గ్రాఫిక్స్

      విభిన్న కలర్ మరియు లేఔట్లతో నాలుగు రకాల బాడీ గ్రాఫిక్స్ లభిస్తున్నాయి.

      • ధర: రూ. 1090 నుండి రూ. 1190 మధ్య
      • మారుతి సెలెరియో యాక్ససరీలు

        అల్లాయ్ వీల్స్ మరియు వీల్ కవర్లు

        మారుతి సెలెరియో 14-అంగుళాల చక్రాలతో లభిస్తోంది. ఇందులో సెలెరియో టాప్ ఎండ్ వేరియంట్ 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌లో లభ్యమవుతోంది. సెలెరియో ఎంట్రీ లెవల్ వేరియంట్లు పలు రకాల వీల్ కవర్స్‌తో ఎంచుకోవచ్చు.

        ధర:

        • అల్లాయ్ వీల్స్ - రూ. 4100 నుండి రూ. 4490 మధ్య
        • వీల్ కవర్స్(ఒక్కొక్కటి) - రూ. 490
        • మారుతి సెలెరియో యాక్ససరీలు

          సీట్ కవర్లు

          సీట్ కవర్లు లేకుండా యాక్ససరీలను పూర్తిగా ఎంచుకోవడం దాదాపు అసాధ్యం. మారుతి సెలెరియో కోసం పది రకాల సీట్ కవర్లను ఎంచుకోవచ్చు. వీటిని ఫాక్స్ లెథర్, జ్యూట్, ఫ్యాబ్రిక్ లేదా జ్యూట్ మరియు ఫ్యాబ్రిక్ కాంబినేషన్లతో కూడిన మెటీరియల్‌తో తయారు చేశారు.

          • ధర రూ. 4,590 నుండి రూ. 6,690 మధ్య
          • మారుతి సెలెరియో యాక్ససరీలు

            ఫ్లోర్ మ్యాట్లు మరియు డోర్ సిల్స్

            రెండు రకలా కన్వెన్షనల్ మ్యాట్లు మరియు ఒక డిజైనర్ మ్యాట్ లభిస్తోంది. అదనంగా, సెలెరియో బ్రాండెడ్ డోర్ సిల్స్ మరియు ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్ ఎంచుకోవచ్చు. సెలెరియో ప్రారంభ వేరియంట్లలో పవర్ విండోలను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.

            ధర:

            • ఫ్లోర్ మ్యాట్లు - రూ. 699 నుండి రూ. 990 మధ్య
            • డోర్ సిల్స్ - రూ. 590 నుండి రూ. 2,990 మధ్య
            • పవర్ విండోలు - రూ. 6,590
            • మారుతి సెలెరియో యాక్ససరీలు

              ఇంటీరియర్ స్టైలింగ్ మరియు పవర్ ప్యాక్ ఫీచర్లు

              స్టీల్ పెడల్స్ ఇప్పుడు సెలెరియో ఇంటీరియర్‌ను ఇప్పుడు మరింత స్పోర్టివ్‌గా మలిచాయి. అంతే కాకుండా, ఆంబియంట్ ఇల్యూమినేటెడ్ లైటింగ్, ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ స్థానంలో ఆటో డిమ్మింగ్ యూనిట్, చార్‌కోల్ లేదా కార్బన్ ఫినిషింగ్‌తో ఎంచుకోగల డ్యాష్‌బోర్డ్ ఇన్‌లేస్ ఉన్నాయి.

              ధరలు:

              • స్టీల్ పెడల్స్ - రూ. 295
              • ఆంబియెంట్ లైటింగ్ - రూ. 490
              • ఆటో-డిమ్మింగ్ మిర్రర్లు - రూ. 5,990
              • డ్యాష్‌‌బోర్డ్ ఇన్‌లేస్ - రూ. 3,390 నుండి రూ. 4,290 మధ్య
              • మారుతి సెలెరియో యాక్ససరీలు

                కార్ ప్రొటెక్షన్

                మార్కెట్లో ఉన్న మరెన్నో ఇతర కార్ల తరహాలో మారుతి సెలెరియో కూడా పలు ముఖ్యమైన ప్రొటెక్షన్ యాక్ససరీలతో లభిస్తోంది. అయితే, రెగ్యులర్ ధరల కంటే కాస్త ప్రీమియం బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

                ధరలు:

                • బాడీ కవర్ - రూ. 890
                • మడ్ ఫ్లాప్స్ (X4) - రూ. 225 నుండి రూ. 245
                • సన్ షేడ్స్ (X2) - రూ. 225
                • మారుతి సెలెరియో యాక్ససరీలు

                  డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

                  స్మాల్ కార్ సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న మోడల్ మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుండటంతో తిరుగులేని ఫలితాలు కనబరుస్తోంది. అయితే, సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును ఎంచుకోవాలనుకునే కస్టమర్లు పైన పేర్కొన్న అదనపు యాక్ససరీలతో తమ కారును ఇతరుల కంటే చాలా విభిన్నంగా మలుచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Celerio Accessories List: The Car Comes With A Host Of Genuine Accessories To Choose From
Story first published: Monday, June 11, 2018, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X